Shikhar Dhawan : దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 264 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందు ఉంచడంతో.. దాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 పరుగులు చేసి తమ వంతు పాత్ర పోషించారు. హార్దిక్ పాండ్యా 28, అక్షర్ పటేల్ 27 కీలక సమయంలో రాణించి ఆకట్టుకున్నారు. 2017 లోను టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వెళ్ళింది. నాడు పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైంది. 8 సంవత్సరాల తర్వాత టోర్నీ జరుగుతున్నప్పటికీ టీమిండియా మునుపటి ఆట తీరునే ప్రదర్శిస్తోంది. గత ఏడది టి20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా.. ఈసారి కూడా అదే స్థాయిలో ఆడుతోంది. 2017లో ట్రోఫీ కోల్పోయిన నేపథ్యంలో.. ఈసారి ఎటువంటి తప్పుకు చోటు ఇవ్వకూడదని టీమిండియా భావిస్తోంది. అందులో భాగంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో సరికొత్తగా కనిపిస్తోంది. దుబాయ్ వేదికగా టీం ఇండియా మ్యాచ్లు ఆడుతోంది కాబట్టి.. ఆ మైదానం దృష్ట్యా నలుగురు స్పిన్నర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. దానికి తగ్గట్టుగా ఫలితాలు రాబట్టింది.
Also Read : ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అతడే బెస్ట్ ఫీల్డర్.. రవి శాస్త్రి చేతుల మీదుగా మెడల్ అందుకున్న ఆటగాడు ఎవరంటే?
టీమ్ ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఇన్ స్టా గ్రామ్ లో తన అనుభవాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ కి అతడిని బ్రాండ్ అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది. ఈ సందర్భంగా అతడు ప్రస్తుతం దుబాయ్ లోనే ఉంటున్నాడు. టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు..”మీతో క్రికెట్ ఆడాను. ఇప్పుడు మీరు ఆడుతుంటే చూస్తున్నాను. అద్భుతమైన ప్రయాణం సాగించారు. అక్కడినుంచి ఇక్కడిదాకా నేను చూడటం గొప్పగా అనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వెళ్ళినందుకు మీకు శుభాకాంక్షలు. ఫైనల్ లోనూ మీరు ఇదే ఆటతీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నానని” శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. శిఖర్ ధావన్ టీం ఇండియాలో డ్యాషింగ్ ఓపెనర్ గా పేరు పొందాడు. ఎడమ చేతివాటంతో టీమ్ ఇండియాకు ఎన్నో విలువైన విజయాలు అందించాడు. ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చాడు. అంతకుముందే ఆయేషాకు వివాహమైంది. మొదటి భర్తతో ఆమె విడాకులు తీసుకుంది. శిఖర్ ధావన్ ద్వారా మళ్ళీ ఒక బాబుకు జన్మనిచ్చింది. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి సంవత్సరం ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైంది. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ఇటీవల తన కుమారుడు జోరావర్ ను మిస్ అవుతున్నానని శిఖర్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ – భారత్ తలపడిన ఓ మ్యాచ్లో ఓ విదేశీ యువతి తో కనిపించాడు..ఐతే ఆమెతో శేఖర్ సన్నిహిత సంబంధం నెరుతున్నాడని మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి.
Also Read : 2023 లో ఓడించిన బాధ.. అందుకే ఆస్ట్రేలియాపై కేఎల్ రాహుల్ కసిగా ఆడాడా?
Shikhar Dhawan’s Instagram post for team India ahead of the final. ❤️ pic.twitter.com/lnXwJpYLWP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025