https://oktelugu.com/

Ind vs Eng: భారత్ ను నిలబెట్టిన షమీ, బుమ్రా

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి నుంచి విజయం దిశగా సాగుతోంది. ఐదోరోజు అప్పటికే టాప్ ఆర్డర్ అందరూ ఔట్ కాగా.. క్రీజులో రిషబ్ పంత్ మాత్రమే ఉన్నాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే రిషబ్ పంత్ (22) ఔటయ్యాడు. రాబిన్ సన్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 194 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ కూడా 200/7 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. […]

Written By: NARESH, Updated On : August 16, 2021 5:49 pm
Follow us on

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి నుంచి విజయం దిశగా సాగుతోంది. ఐదోరోజు అప్పటికే టాప్ ఆర్డర్ అందరూ ఔట్ కాగా.. క్రీజులో రిషబ్ పంత్ మాత్రమే ఉన్నాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే రిషబ్ పంత్ (22) ఔటయ్యాడు. రాబిన్ సన్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 194 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ కూడా 200/7 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇక బౌలర్లు నిలవలేరని టీమిండియా చివరి రోజు ఓడిపోతుందని అందరూ భావించారు. అప్పుడే అసలు ఆట ప్రారంభమైంది.

క్రీజులోకి వచ్చి ఇద్దరు స్టార్ బౌలర్లు షమీ, బుమ్రా ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 87 ఓవర్లకు 200/7 గా స్కోరు ఉన్న వేళ పట్టుదలగా ఆడి ఎడాపెడా బౌండరీలు బాదేసి టీమిండియాను పోటీలో నిలబెట్టారు.

బౌలర్లు షమీ, బుమ్రా అసలు బ్యాట్స్ మెన్ లా ఆట మొదలుపెట్టారు. షమీ అయితే ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ రెచ్చగొడితే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. షమీ 52, బుమ్రా 30 పరుగులతో విలువైన 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను పోటీలో నిలబెట్టారు.

లంచ్ సమయానికి బుమ్రా, షమీ దెబ్బకు 286/8 తో ఏకంగా 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టెస్టుల్లో తొలి ఆఫ్ సెంచరీ సాధించిన షమీకి ప్రేక్షకులతోపాటు టీమిండియా కెప్టెన్ కోహ్లీ సహా జట్టు సభ్యులందరూ హర్షద్వానాలతో స్వాగతం పలకడం విశేషం. మొత్తం ఇద్దరు బౌలర్లు కృషి వల్ల టీమిండియా ఓటమి బారి నుంచి గెలుపు దిశగా సాగుతుండడం విశేషంగా చెప్పొచ్చు.