https://oktelugu.com/

Shahid Afridi: అల్లుడు షాహిన్ కెప్టెన్సీ ఒక్కసారి.. మామ ఆఫ్రిది స్పందన వైరల్

తెల్ల బంతి (వైట్ బాల్) కెప్టెన్ గా మళ్ళీ బాబర్ అజమ్ ను నియమించింది. వన్డేలు, టీ -20 ల్లో పాకిస్తాన్ జట్టును బాబర్ నడిపిస్తాడు.. షాహిన్ ఆఫ్రిది సారధ్యంలో జనవరి నెలలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో 1-4 తేడాతో కప్ కోల్పోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 1, 2024 / 03:34 PM IST

    Shahid Afridi on babar azam become pakistan captain

    Follow us on

    Shahid Afridi: అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ టీం లో.. ఏదైనా జరుగుతుంది. అది ఎప్పుడైనా జరుగుతుంది. ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు వారికే తెలియదు. అచ్చం ఆ దేశ పరిపాలన లాగా.. ఆ దేశ క్రికెట్ జట్టు నిర్వహణ కూడా అలాగే ఉంటుంది. గత ఏడాది చివరిలో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కెప్టెన్ బాబర్ అజామ్ తప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పటికప్పుడు షాన్ మసూద్ కు టెస్ట్, పేస్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదికి టీ-20 బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ నిర్ణయం ఎంత తప్పో తర్వాత గాని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అర్థం కాలేదు. వరుస సిరీస్ లలో అత్యంత నాసిరకమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో పాకిస్తాన్ బోర్డు మళ్ళీ తన పాత నిర్ణయానికి వచ్చేసింది.

    తెల్ల బంతి (వైట్ బాల్) కెప్టెన్ గా మళ్ళీ బాబర్ అజమ్ ను నియమించింది. వన్డేలు, టీ -20 ల్లో పాకిస్తాన్ జట్టును బాబర్ నడిపిస్తాడు.. షాహిన్ ఆఫ్రిది సారధ్యంలో జనవరి నెలలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో 1-4 తేడాతో కప్ కోల్పోయింది. దీంతో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీ ఒక సిరీస్ కే పరిమితమైపోయింది.. కెప్టెన్సీ మార్చడంతో పాకిస్తాన్ జట్టు మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకొని నిర్ణయం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వికెట్ కీపర్, బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.. “ఎంపిక కమిటీలో చాలామంది అనుభవం ఉన్న క్రికెటర్లు ఉన్నారు. వీరందరూ అలాంటి నిర్ణయం తీసుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కెప్టెన్ ను మార్చాలని ఒకవేళ వారు భావిస్తే మహమ్మద్ రిజ్వాన్ ను ఎంపిక చేస్తే బాగుండేది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక చేసేదేముండదు. ఎలాగైనా సరే నేను పాకిస్తాన్ జట్టుకు మద్దతు దారుడిగా ఉంటాను. నూతన కెప్టెన్ గా నియమితుడైన బాబర్ కు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను”అంటూ అఫ్రిది తన ట్విట్టర్ ఎక్స్ లో రాసుకోవచ్చాడు.

    షాహిద్ ఆఫ్రిది తన కూతురు ను షాహిన్ ఆఫ్రిదికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే షాహిన్ కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని మొదటినుంచి షాహిద్ అఫ్రిది తప్పు పడుతూ వస్తున్నాడు. టి20 కెప్టెన్ గా గతంలో అతని పేరు ప్రకటించినప్పుడు బహిరంగంగానే ఆఫ్రిది తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడికి కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని, రిజ్వాన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని ఓ టీవీ చర్చ కార్యక్రమంలో అతడు పేర్కొన్నాడు. మరో వైపు షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తొలగించడం పట్ల అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సిరీస్లో విఫలమైనంతమాత్రాన కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. మరోవైపు షాహిన్ ఆఫ్రిది ఆట తీరు ఏమాత్రం బాగోలేదని, అన్ని గణాంకాలు పరిశీలించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.