Congress Govt: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్…

ఏ భూమికి రైతు బంధు నిధులు వస్తున్నాయో.. ఆ భూమిని కచ్చితంగా సాగు చేయాలి అని తెలిపింది ప్రభుత్వం. కేవలం 5 ఎకరాల భూమి ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు వస్తున్నాయి.

Written By: Swathi, Updated On : April 1, 2024 3:22 pm

Congress govt good news for farmers

Follow us on

Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలను నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తోంది కూడా. ఇప్పటికే చాలా మంది ఈ గ్యారెంటీ పథకాల్లో లబ్ది పొందారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అర్హులైన రైతులకు మాత్రమే రైతుబంధు నిధులను మంజూరు చేసింది ఈ ప్రభుత్వం.

ఏ భూమికి రైతు బంధు నిధులు వస్తున్నాయో.. ఆ భూమిని కచ్చితంగా సాగు చేయాలి అని తెలిపింది ప్రభుత్వం. కేవలం 5 ఎకరాల భూమి ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు వస్తున్నాయి. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు మంజూరు చేయలేదట ప్రభుత్వం. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు

మరోవైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా రైతుబంధు నిధులు విడుదల చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుబంధు కీలక కామెంట్లు చేశారు. రైతు బంధు నిధులు ఇవ్వలేదని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. అంతేకాదు 64 లక్షల 75 వేల మంది రైతులకు రూ. 5,575 కోట్ల పెట్టుబడి సాయం కూడా అందించామని తెలిపారు.

92 శాతం రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేశామని తేల్చి చెప్పారు. మిగిలిన వారందరూ కూడా ఎక్కవు భూమి ఉన్నవారిని.. అందులో కూడా అర్హులైన వారికి నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. కానీ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఏకంగా రైతు భరోసా కింద చెప్పినట్టు రూ. 15 వేలు జమచేస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నట్టు సమాచారం.