India Vs New Zealand Semi Final: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీప్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలవడం ద్వారానే టీమిండియా విజయం సాధించింది అన్నంత సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. మరోవైపు టీమిండియా సెమీ ఫైలన్‌లో ఎలాంటి మార్పు లేకుండానే మార్పు లేకుండానే బరిలో దిగుతోంది. మొదట ఒక మార్పు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పిచ్‌ను పరిశీలించిన తర్వాత కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ లీగ్ జట్టుతోనే ఆడాలని భావించారు.
స్లో పిచ్..
ముంబై వేదికగా జరిగే సెమీఫైన్‌లో మొన్నటి వరకు తేమ కనిపించింది. దీంతో సెమీస్ జట్టులో మరో స్పిన్నర్‌ను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. కానీ, ఈరోజు పిచ్ పరిశీలించాక డ్రైగా కనిపించింది. బాల్ స్వింగ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో స్పిన్న అవసరం లేదని పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించింది. మరోవైపు వాంకడే పిచ్‌పై బాల్ బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే స్పిన్నర్‌ను తీసుకోవడం సరికాదని కెప్టెన్, కోచ్ నిర్ణయించారు.
లెవెన్ జట్టు ఇదే..
కెప్టెన్ రోహిత్, శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ, స్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్.రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్రజడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.