Telugu News » Sports » See who ms dhoni celebrated his birthday with viral video
MS Dhoni : ఎంఎస్ ధోనీ ఎవరితో బర్త్ డే జరుపుకున్నాడో చూస్తారా? వైరల్ వీడియో
ధోని మాత్రం అత్యంత నిరాడంబరంగా తన పుట్టినరోజు వేడుకలను ఇంట్లో తనకు ఇష్టమైన వారి మధ్య జరుపుకున్నాడు. తనకు ఇష్టమైన అంటే కుటుంబ సభ్యులు బంధువులతో కాదు.. ప్రేమగా పెంచుకుంటున్న శునకాలతో బర్త్ డే వేడుకలు జరుపుకున్న వీడియోను ధోనీ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ధోని.
MS Dhoni : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో ధోనీకి భారీగా కటౌట్లను అభిమానులు కట్టారు. కొన్నిచోట్ల అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ధోని పుట్టినరోజు వేడుకలు జరిపిన అభిమానులు.. పెద్ద ఎత్తున అన్నదానంతోపాటు వస్త్రాలు, పండ్లు వంటివి పంపిణీ చేశారు. అభిమానులు ధోని 42వ పుట్టినరోజు వేడుకలను హంగామా మధ్య జరిపితే.. ధోని మాత్రం అత్యంత నిరాడంబరంగా తన పుట్టినరోజు వేడుకలను ఇంట్లో తనకు ఇష్టమైన వారి మధ్య జరుపుకున్నాడు. తనకు ఇష్టమైన అంటే కుటుంబ సభ్యులు బంధువులతో కాదు.. ప్రేమగా పెంచుకుంటున్న శునకాలతో బర్త్ డే వేడుకలు జరుపుకున్న వీడియోను ధోనీ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ధోని.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అట్టహాసంగా నిర్వహిస్తే.. ధోని మాత్రం అత్యంత నిరాడంబరంగా తన పుట్టినరోజు వేడుకలను రాంచీలోని తన నివాసంలో జరుపుకున్నాడు. అది కూడా తనకు అత్యంత ఇష్టం ఉన్న శునకాల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ముందుగా కేక్ కట్ చేసిన ధోని.. ఆ కేకు మొక్కలను శునకాలకు అందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. రాంచీలోని ఫామ్ హౌస్ లో ఈ బర్త్ డే వేడుకలను ధోని జరుపుకున్నాడు. ఈ పుట్టినరోజు వేడుకలకు ధోని ప్రత్యేక అతిధులను ఎవరనీ ఆహ్వానించలేదు. ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న నాలుగు డాగ్స్ మధ్య కేక్ కట్ చేసి వాటికి కేకు ముక్కలు అందిస్తూ ధోని పుట్టినరోజు వేడుకలను ఎంజాయ్ చేశాడు.
ధన్యవాదాలు తెలిపిన ధోని..
ఇక సామాజిక మాధ్యమాలు వేదికగా తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మహేంద్ర సింగ్ ధోని ధన్యవాదాలు తెలిపాడు. తన పుట్టిన రోజున తాను ఏం చేశానో మీరు చూడండి అంటూ ధోని ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అత్యంత నిరాడంబరంగా ధోని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం అంటే ఇదేనని, ఈ రోజుల్లో సాధారణ వ్యక్తులు కూడా పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా జరుపుకుంటూ హడావిడి చేస్తున్న తరుణంలో.. ధోని వంటి లెజెండ్ ఇంత సాధారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.