Manoj Muntashir : మతం, దైవం, సాంప్రదాయలను టచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవి చాలా సున్నితమైన విషయాలు. మనకు ఇష్టం వచ్చినట్లు చూపిస్తే, మాట్లాడితే జనాలు హర్షించరు. ఆదిపురుష్ విషయంలో అదే జరిగింది. మోడరన్ రామాయణ పేరుతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ తీవ్ర విమర్శల పాలైంది. రాముడు, రావణాసురుడు పాత్రలను కొత్తగా డిజైన్ చేశాడు. కొన్ని సన్నివేశాలైతే రామాయణంతో అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. ఆదిపురుష్ చూసిన ఆడియన్స్ ఇది అసలు రామాయణమేనా అనే సందేహం వ్యక్తం చేశారు.