England : స్కాట్లాండ్ గెలుపు.. టీ 20 వరల్డ్ కప్ నుంచి.. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ అవుట్..

England స్కాట్లాండ్ ఆట తీరు చూస్తుంటే ఆస్ట్రేలియా మీద అంత దారుణంగా ఓడిపోతుందనిపించడం లేదు. ఆ జట్టు ఆటగాళ్లు పక్క ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తున్నారు.. గత వరల్డ్ కప్ విన్నర్ గా నిలిచిన ఇంగ్లాండ్.. ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఎదురీదడం నిజంగా విధి వైచిత్రే.

Written By: NARESH, Updated On : June 10, 2024 4:17 pm

Scotland's win... Reigning champion England out of T20 World Cup

Follow us on

England : టి20 వరల్డ్ కప్ లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ వరుసగా రెండవ విజయం సాధించడంతో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఒమన్ తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది . ఆ జట్టు ఓపెనర్ ప్రతీక్ 54, అయాన్ ఖాన్ 41* పరుగులు చేసి ఆకట్టుకున్నారు. షరీఫ్ (2/40) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వాట్, బ్రాడ్ వీల్, క్రిస్ సోలే, గ్రేవ్స్ తలా ఒక వికెట్ సాధించారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో మూడు వికెట్లకు 153 పరుగులు చేసి, విజయం సాధించింది.. బ్రాండన్ (61 నాట్ అవుట్) మైదానంలో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. అతడికి మూన్సే(41) తోడు కావడంతో స్కాట్లాండ్ జట్టుకు ఎదురే లేకుండా పోయింది. ఒమన్ బౌలర్లలో మెహరాన్ ఖాన్, అఖిబ్, బిలాల్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో స్కాట్లాండ్ గ్రూప్ -బీ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది..

ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడాల్సిన క్రమంలో వర్షం వల్ల రద్దయింది. దీంతో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ జట్లకు చెరొక పాయింట్ దక్కింది. ఆ తర్వాత నమీబియా జట్టుపై జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ గెలుపొందింది. ఇక తాజాగా ఒమన్ పై విజయాన్ని దక్కించుకొని సూపర్ -8 వైపు వెళ్లే ప్రయత్నాలను మరింత బలోపేతం చేసుకుంది.. స్కాట్లాండ్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడుతుంది. ఒకవేళ ఆ జట్టుపై గెలిచినా లేదా రన్ రేట్ తగ్గకుండా గట్టి పోటీ ఇచ్చినా స్కాట్లాండ్ కు ఇబ్బంది ఉండదు. స్కాట్లాండ్ ఒమన్ పై విజయం సాధించడంతో ఇంగ్లాండ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఆస్ట్రేలియా చేతిలో ఆ జట్టు దారుణమైన ఓటమిని చవి చూసింది. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం -1.800 నెగిటివ్ రన్ రేట్ తో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్ లు ఒమన్, నమీబియాతో ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ గెలిచినప్పటికీ.. ఆ జట్టు ఖాతాలో ఐదు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు స్కాట్లాండ్ తో సమానంగా నిలుస్తుంది..రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టుకే తదుపరి దశకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ సూపర్ -8 కు వెళ్లాలంటే.. తను ఆడే తదుపరి రెండు మ్యాచ్ లను భారీ తేడాతో గెలవాలి. అంతేకాదు ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ దారుణంగా ఓడిపోవాలి. స్కాట్లాండ్ ఆట తీరు చూస్తుంటే ఆస్ట్రేలియా మీద అంత దారుణంగా ఓడిపోతుందనిపించడం లేదు. ఆ జట్టు ఆటగాళ్లు పక్క ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తున్నారు.. గత వరల్డ్ కప్ విన్నర్ గా నిలిచిన ఇంగ్లాండ్.. ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఎదురీదడం నిజంగా విధి వైచిత్రే.