Sukanya Samriddhi Yojana : కూతురు వివాహానికి రూ. 35 లక్షలు రావాలంటే నెలకు ఎంత జమ చేయాలి?

Sukanya Samriddhi Yojana అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ అకౌంట్ ఓపెన్‌ చేసిన తర్వాత అమ్మాయి వయసు 21 ఏళ్లు నిండితే లేదంటే అమ్మాయి పెళ్లి జరిగినా అకౌంట్ క్లోజ్‌ అవుతుంది.

Written By: NARESH, Updated On : June 10, 2024 4:44 pm

Sukanya Samriddhi Yojana

Follow us on

Sukanya Samriddhi Yojana : తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రులు రూపాయి, రూపాయి కూడబెడుతుంటారు. ఆడ పిల్ల ఉన్నదంటే చాలు మరింత జాగ్రత్తగా ఉంటారు. మగ పిల్లవాడు అయితే కేవలం చదువు మాత్రమే ఉంటుంది. దానికి తగ్గ ఉద్యోగం ఆయనే వెతుక్కుంటాడు. ఆడపిల్ల అయితే చదివించాలి, ఆమె ఉద్యోగం చేసినా చేయకున్నా.. ఎంతో కొంత కష్టం ఇచ్చి మరీ గ్రాండ్ గా పెళ్లి చేయాల్సిందే. ఆడబిడ్డ వివాహం వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకూడని అనుకుంటారు. అందుకే కూడబెడతారు. ఇలాంటి వారి కోసమే కేంద్రం ఒక మంచి పథకాన్ని తీసుకువచ్చింది. దాని గురించి తెలుసుకుందాం.

కేంద్రం ఆడబిడ్డల కోసం తీసుకువచ్చిన పథకం ‘సుకన్య సమృద్ధి యోజన’. ఈ పథకంలో ప్రతీ నెల కొంత మొత్తంలో జమ చేసుకుంటూ పోతే ఆడబిడ్డ పైచదువులకు, లేదంటే వివాహానికి పెద్ద మొత్తంలో రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం అందిస్తున్న ఈ పథకం ద్వారా సెక్యూరిటీతో పాటు రిటర్న్స్‌ కూడా భారీగానే వస్తాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్‌ మినహాయింపు బెనిఫిట్స్‌ ఉంటాయి. అయితే, ఒక వేళ రూ. 35 లక్షల వరకు కూతురు వివాహ సమయం వరకు రావాలంటే ఈ పథకంలో నెలకు ఎంత కట్టాలో తెలుసుకుందాం.

రూ. 35 లక్షలు రిటర్న్స్‌ రావాలనుకుంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతి నెలా రూ. 6250 చొప్పున 15 ఏళ్లు జమ చేస్తూ వెళ్లాలి. ఈ పథకంలో జమ చేసిన దానికి 8.2 శాతం వడ్డీ వస్తుంది. వడ్డీ ఏడాదికోసారి యాడ్ అవుతుంది. ఆడబిడ్డకు పదేళ్లు వచ్చిన తర్వాత ఆమె పేరుపై సుకన్య సమృద్ధి యోజన కింద తల్లిదండ్రులు ఖాతా తెరవచ్చు. ఇందులో నెలకు కనీస పెట్టుబడిగా రూ. 250 వేయవచ్చు, ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు. నెలకు, లేదంటే ఏడాదికి ఒకసారి కూడా డిపాజిట్‌ చేయవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ అకౌంట్ ఓపెన్‌ చేసిన తర్వాత అమ్మాయి వయసు 21 ఏళ్లు నిండితే లేదంటే అమ్మాయి పెళ్లి జరిగినా అకౌంట్ క్లోజ్‌ అవుతుంది.