Rahul Gandhi : ప్రపంచ ప్రచార యాత్రకు భారత్ దళాలు మొదలయ్యాయి. 59 మంది ఎంపీలు, మాజీ ఎంపీలు, 8 మంది భారత రాయబారులుగా చేసిన వారితో కలిసి 7 బృందాలుగా ఏర్పడి 32 దేశాలు బయలు దేరుతున్నాయి. 21 నుంచి 24 మధ్యలో ఆ దేశాలకు వెళతారు.
ఇప్పటివరకూ ఇంత పెద్ద ఎత్తున ప్రచార యాత్ర జరగలేదు. ఇందులో బీజేపీ వారే కాకుండా అన్ని పార్టీల వారు ఉన్నారు. నాయకత్వం వహించేవారు కూడా ఇతర పార్టీల వారు ఉన్నారు.
పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తో దెబ్బతీసినా.. ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి దేశభక్తియుత జాతీయ కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలిసికట్టుగా తీసుకున్నాయి.
శశిథరూర్, ఆనంద్ శర్మ, గులాంనబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్, లాంటి కీలక నేతలందరూ కమ్యూనికేట్ చేసే వారిని ఎంపిక చేసి ఆయా దేశాలకు పంపించనున్నారు. పార్లమెంట్ పై దాడి నుంచి నటి పహల్గాం వరకూ ప్రపంచవ్యాప్తంగా పాక్ తీవ్రవాదాన్ని అందరికీ వివరించనున్నారు. పాక్, భారత్ ను సమంగా చూస్తున్న అమెరికా, యూరప్ దేశాలకు జ్ఞానోదయం కలిగించేలా ఈ యాత్రలు చేపట్టనున్నారు.
అన్ని పార్టీలు కలిసికట్టుగా పాకిస్తాన్ ని ఎండగట్టడానికి ప్రపంచ యాత్ర చేయబోతున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.