Theobroma: తండ్రి ఇచ్చిన చిన్న పెట్టుబడితో 3500 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన సిస్టర్స్..

ముంబైకి చెందిన ఇద్దరు సోదరీమణులు 2004లో తండ్రి వద్ద అప్పు చేసి చిన్న గది బేకరీ వ్యాపారం ప్రారంభించారు. ఈ వ్యాపారం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందంటే, నేడు ఇది భారతదేశపు అతిపెద్ద బేకరీ బ్రాండ్లలో ఒకటిగా మారింది.

Written By: Mahi, Updated On : October 19, 2024 1:39 pm

Theobroma

Follow us on

Theobroma: ఇద్దరు సోదరీమణులు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒకే గదిలో బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించారు, ఇది నేటి కాలంలో పెద్ద వ్యాపారంగా మారింది. దేశ వ్యాప్తంగా పలు దుకాణాలు తెరుచుకున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఇండియాలో పాపులర్ బేకరీ బ్రాండ్లలో ముందు వరుసలో ఉన్న బ్రాండ్ ‘థియోబ్రోమా’. దీనిని 2004లో ఇద్దరు సోదరీమణులు కెనాజ్, టీనా మాస్మాన్ ప్రారంభించారు. ముంబైకి చెందిన వీరు 2004లో వారి తండ్రి వద్ద అప్పు చేసి చిన్న గదిలో బేకరి తెరిచారు. ఈ వ్యాపారం ఇంతింతై వటుడింతై చందంగా పెరుగతూ వెళ్లింది. ఎంత వేగంగా అభివృద్ధి చెందిందంటే నేడు భారతదేశపు అతిపెద్ద బేకరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. దేశ వ్యాప్తంగా 225 ఔట్ లెట్లను ప్రారంభించగా, కంపెనీ విలువ రూ. 3500 కోట్లుగా ఉంది. కెనాజ్, టీనా మెస్మాన్ తమ అభిరుచితో పెద్దగా వ్యాపార ప్రణాళిక లేకుండా ఇంత పెద్ద వ్యాపారాన్ని నిర్మించగలిగారు. 2004 లో కెనాజ్ వెన్నునొప్పి కారణంగా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంది. అప్పుడే వారి మదిలో మెదిలిన బిజినెస్ ఐడియానే థియోబ్రోమా ఏర్పాటుకు బాటలు వేసింది. ఆమె పేస్ట్రీ సేఫ్ గా పనిచేసేది. తన తల్లికి వివిధ రకాల వంటలు చేయడంలో సహాయం చేసేది.

16 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ టూర్ వెళ్లినప్పుడు భవిష్యత్తులో చెఫ్ అవ్వాలని కైనాజ్ భావించింది. దేశంలోని ప్రముఖ హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఐహెచ్ఎం ముంబై, ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఓసీఎల్డీ) ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ తీసుకుంది. 2004లో మొదటి థియోబ్రోమా పేస్ట్రీ షాపును ఒబెరాయ్ ఉదయ్ ఇల్లాస్ లో పేస్ట్రీ చెఫ్ గా చేరింది.

ఈ ఇద్దరికీ మంచి బేకింగ్ అనుభవం ఉంది. కానీ బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించే వారికి మూలధనం అవసరం. అప్పుడు వారి తండ్రి సాయం చేశాడు. వారి తండ్రి వీరి బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రూ .1.5 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టాడు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మూలధనం అవసరమైంది.

ఆ సంస్థ పేరు వెనుక కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సోదరీమణుల మొదటి అవుట్ లెట్ 2004లో ముంబైలోని కొలాబాలో దసరా రోజు ప్రారంభించారు. బేకరీకి ఒక పేరును ఎంచుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు అతనికి థియోబ్రోమా అని పేరు పెట్టాడు, ఇది గ్రీకు పదాలు థియోస్ (దేవుడు) మరియు బ్రోమా (ఆహారం) అంటే ‘దేవతల ఆహారం’. ఈ పేరు అందరికీ నచ్చడంతో ఈ కంపెనీ పేరు థియోబ్రోమాగా స్థిరపడిపోయింది.

ప్రస్తుతం దేశంలో ఫుడ్ బిజినెస్ లో మొదటి వరుసలో ఉన్న ‘థియోబ్రోమా’ను రూ. 3,500 కోట్లతో కొనుగోలు చేయవచ్చని కొన్ని నివేదికలు సూచించాయి. క్రిస్ క్యాపిటల్ థియోబ్రోమా ఫుడ్స్, బెల్జియం వాఫిల్ కంపెనీని సుమారు రూ. 3,200-3,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు దగ్గరగా ఉందని నివేదిక తెలిపింది.