Sara Tendulkar : ఇవీ కొంతకాలంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్, టీమిండియా యువ ఆటగాడు గిల్ పై చక్కర్లు కొడుతున్న పుకార్లు. మీడియాలో.. సోషల్ మీడియాలో చేస్తున్న షికార్లు. దీనిపై ఇంతవరకు సారా నోరు విప్పలేదు. బదులివ్వలేదు. ఎలాగూ వీరిద్దరూ ఏమీ చెప్పడం లేదని గాసిప్ రాయుళ్ళు మరింత ఘాటుగా రాయడం మొదలుపెట్టారు. మరింత వేగంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ సారా నుంచి నో రెస్పాన్స్.. గిల్ నుంచి నో కామెంట్స్. దీనిపై వారిద్దరూ వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఇక ఆ మధ్య గిల్ బీభత్సంగా బ్యాటింగ్ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా అభినందించాడు. ఇంకేముంది కాబోయే అల్లుడిని సచిన్ ఆకాశానికి ఎత్తుతున్నాడని.. తన కొడుకుని కాకపోయినా అల్లుడినైనా గొప్ప ఆటగాడిగా చేస్తాడని వ్యాఖ్యలు వినిపించాయి.
ఇన్నాళ్లకు క్లారిటీ
వాస్తవానికి గిల్, సారా డేటింగ్ చేసినట్టు ఆరోపణలు మాత్రమే కాదు.. వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా కొంతమంది సృష్టి అని వాదించిన వారు కూడా లేకపోలేదు. డేటింగ్ మీద ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో గిల్, సారా రిలేషన్ కు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఐతే గిల్ డేటింగ్ చేస్తోంది బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ తో నట.. హీరో సిద్ధాంత్ చతుర్వేదితో సారా రిలేషన్ లో ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి బాలీవుడ్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.. మరోవైపు గిల్ ఆడుతున్న మ్యాచ్లకు అవినీత్ హాజరవుతోంది. ఇక ఇటీవల విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ఖాతా నుంచి అవనీత్ ఫోటోలు లైక్ చేసినట్టు తెలియ వచ్చింది. దీనిపై విరాట్ కోహ్లీ కూడా వివరణ ఇచ్చాడు.. అయినప్పటికీ కౌర్ కు కావలసినంత ప్రచారం లభించింది. సిద్ధాంత్ తో కలిసి సారా లేట్ నైట్ పార్టీలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్ని రకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు గిల్, సారా ఎప్పటిలాగానే నోరు విప్పలేదు. సిద్ధాంత్, అవినీత్ సైలెంట్ గా తన పని తాము చేసుకుంటూ పోతున్నారు. ” నిప్పు లేనిదే పొగరాదు. వీరి మధ్య ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అధికారికంగా వారు ప్రకటించేంతవరకు ఇది ఒక రకమైన పుకారు గా మాత్రమే ఉంటుంది. కానీ పుకార్లు అంత సులభంగా పుట్టవు కదా.. దాని వెనుక జరుగుతున్నది వాస్తవం కాబట్టే ఇలాంటి ప్రచారాలు ఉంటాయని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం గుజరాత్ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టును సమర్థవంతమైన స్థానంలో నిలిపాడు. వరుస విజయాలు దక్కేలా చూస్తూ.. ప్లే ఆఫ్ మందు నిలబెట్టాడు. ఒక సారధిగా అన్ని వైపుల నుంచి అభినందనలు అందుకుంటున్నాడు.