GT Vs MI IPL 2025: వర్షం పదేపదే ఈ మ్యాచ్కు అంతరాయం కలిగించింది. వారికి డక్ వర్త్ లూయిస్ విధానాన్ని అంపైర్లు అమల్లో పెట్టారు. మొత్తంగా మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు అనేక మలుపులు తిరిగింది. లాస్ట్ బాల్ వరకు థ్రిల్లర్ సినిమాను తలపించింది. చివరికి గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక చివరి ఓవర్ లో గుజరాత్ టైటాన్స్ గెలుపు సాధించడానికి 15 రన్స్ అవసరమయ్యాయి. ఈ దశలో గెరాల్ట్ కోయిట్జీ, రాహుల్ తెవాటియా చివరికి గెలుపు లక్ష్యాన్ని సాధించారు. ఈ విజయం ద్వారా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కొల్లగొట్టింది. దాదాపు ప్లే ఆఫ్ కు దగ్గరయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్లో ఫస్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. 8 వికెట్లు లాస్ అయి 155 రన్స్ చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ముంబై విధించిన 156 రన్ టార్గెట్ ను చేధించడానికి గుజరాత్ టైటాన్స్ మొదటి నుంచి కష్టపడింది. 19 ఓవర్లలో 7 వికెట్లు లాస్ అయి 147 రన్స్ చేసింది..గిల్ రేపటిలాగే ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. జోస్ బట్లర్ 30 రన్స్ చేశాడు.. బుమ్రా, బౌల్ట్, అశ్విని కుమార్ చెరి రెండు వికెట్లు సాధించారు. బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ ఒకానొక దశలో విజయం సాధిస్తుందనుకుంటున్న తరుణంలో.. లాస్ట్ ఓవర్ లో 15 రన్స్ ను డిపెండ్ చేయలేక ఓడిపోయింది.
Also Read: వీర విహారం చేసే విరాట్ కెప్టెన్సీ ని ఎందుకు వదిలేసాడు.. ఇన్నాళ్లకు తెలిసిన అసలు నిజం!
ఇవీ మ్యాచ్లో హైలెట్స్
156 టార్గెట్ ను చేసే క్రమంలో గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ (5) త్వరగానే పెవిలియన్ చేరుకున్నాడు.
గిల్, బట్లర్ నిదానంగా ఆటం వల్ల గుజరాత్ స్కోర్ అంతగా ముందుకు వెళ్లలేదు. హార్దిక్ పాండ్యా వేసిన 8 ఓవర్ లో గిల్ – బట్లర్ తమ జోరు చూపించారు. ఏకంగా 18 రన్స్ పిండుకున్నారు.
అశ్వని కుమార్ 12 ఓవర్లో గిల్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను తిలక్ వర్మ పట్టుకోలేకపోయాడు. అయితే నెక్స్ట్ బంతికి అశ్విని కుమార్ బౌలింగ్ లో బట్లర్ క్యాచ్ అవుట్ అయ్యాడు..
బట్లర్ అవుట్ అయిన తర్వాత రూథర్ పోర్డ్ రంగంలోకి వచ్చాడు. విల్ జాక్స్ వేసిన 13 ఓవర్లో ఏకంగా 15 పరుగులు చేశాడు. అశ్విని కుమార్ వేసిన తదుపరి ఓవర్ లో భారీ సిక్సర్ కొట్టడంతో గుజరాత్ సెంచరీ మార్క్ అందుకుంది. అప్పుడే రెయిన్ మొదలైంది.
కొంత గ్యాప్ తర్వాత వర్షం తగ్గింది. అనంతరం మ్యాచ్ మళ్లీ మొదలైంది. బుమ్రా బౌలింగ్ కు వచ్చాడు. అతని బౌలింగ్లో గిల్ ఫోర్ కొట్టాడు. తర్వాత మరుసటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్ లో రూథర్ పోర్డు కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ముంబై వైపు టర్న్ అయింది.. బుమ్రా బౌలింగ్ లో షారుక్ ఖాన్ అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ అశ్విని కుమార్ బౌలింగ్ లో పెవీలియన్ చేరుకున్నాడు. ఇక ఈ ఓవర్ లో కోయిట్జి ఫోర్ కొట్టడంతో.. లాస్ట్ రెండు ఓవర్ లలో గుజరాత్ విన్నింగ్ ఈక్వేషన్ 2 ఓవర్స్ కు 24 రన్స్ గా మారింది.
ఈ స్టేజిలో వర్షం మళ్ళీ మొదలైంది. కొంత గ్యాప్ తర్వాత మ్యాచ్ మళ్ళీ ప్రారంభమైంది. ఈ స్టేజిలో డక్ వర్క్ లూయిస్ థియరీ ప్రకారం ఎంపైర్లు ఒక ఓవర్ తగ్గించారు. దీంతో గుజరాత్ గెలవడానికి సిక్స్ బాల్స్ లో 15 రన్స్ అవసరమయ్యాయి. ఈ స్టేజిలో ముంబై స్లో ఓవర్ రేటు గుజరాత్ జట్టుగా కలిసి వచ్చింది. దీంతో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలని అంపైర్లు నిబంధన విధించారు. ఈ క్రమంలో దీపక్ చాహర్ వేసిన ఫస్ట్ బాల్ ను రాహుల్ బౌండరీ కొట్టాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా థ్రిల్లర్ మూవీని తలపించింది. ఇక కోయిట్జీ సిక్సర్ కొట్టి, సింగిల్ తీశాడు. అయితే ఆ బంతి నో బాల్ కావడంతో ఒక్కసారిగా గుజరాత్ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఐదో బంతికి కోయిట్జీ అవుట్ అవ్వడంతో మ్యాచ్ మరోసారి ముంబై వైపు వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ బాల్ కు అర్షద్ ఖాన్ అత్యంత కష్టం మీద సింగిల్ రన్ తీయడంతో గుజరాత్ విక్టరీ సాధించింది. అయితే లాస్ట్ బాల్ కు అర్షద్ ఖాన్ ను రన్ అవుట్ చేసే ఆఫర్చ్యునిటీ ని హార్దిక్ పాండ్యా మిస్ చేసుకున్నాడు.