Integrated Farming : ఇక ఇటీవల కాలంలో పంటల సాగులో ఎరువులు, పురుగుల మందుల ఎక్కువ అయిపోయింది. పంటల్లో చీడపీడలు పెరిగిపోవడమే ఇందుకు కారణం. పర్యావరణహితమైన కీటకాలు పురుగుల మందుల తాకిడికి చనిపోవడం.. ఫలితంగా పంటల మీద చీడపీడల దాడి పెరిగిపోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. పర్యావరణహితమైన కీటకాలు గనుక జీవించి ఉంటే పంటలకు ఈ స్థాయిలో చీడపీడలు ఆశించవు. పైగా పంటల పెరుగుదల.. పంటల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కానీ రైతులు ఈ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ఎరువులను వాడుతున్నారు. రసాయన మందులను పిచికారి చేస్తున్నారు. అయితే కొంతమంది రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ చీడపీడలను నివారిస్తున్నారు. పంటదిగుబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో.. ఎటువంటి రసాయనాలు.. పురుగుల మందులు వాడకుండా గణనీయమైన దిగుబడిని సాధిస్తున్నారు.
Also Read :పెళ్లాం ముక్కు అందంగా ఉందని ముచ్చటపడ్డాడు.. చివరకు ఏం చేశాడంటే?
జపాన్, చైనా దేశాలను అనుసరించి..
మనదేశంలో చిత్తడి నేలలు అధికంగా ఉండే రాష్ట్రాలలో కేరళ ముందు ఉంటుంది. కేరళ రాష్ట్రంలో దొడ్డు రకపు ధాన్యం ఎక్కువగా పండుతుంది. రుతుపవనాల ఆగమనానికి ముందు కేరళ రైతులు వరి నారుమళ్లను సిద్ధం చేస్తుంటారు. ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో.. ఇక అప్పట్నుంచి వరి నారుమళ్లను సిద్ధం చేస్తుంటారు. అయితే కొంతకాలంగా రైతులు తమ చిత్తడి నేలలను శుభ్రం చేసేందుకు బాతులను వాడుతున్నారు. అదేంటి నేలలను బాతులు శుభ్రం చేయడం ఏంటి.. ప్రశ్న మీలో వ్యక్తమౌతోంది కదా.. అయితే బాతులను చిత్తడి నేలల్లో వదలడం వల్ల.. అవి ధాన్యం గింజలను.. ఇతర పురుగులను ఆహారంగా తింటాయి. పైగా బాతులు పొలం మొత్తం తిరగడం వల్ల చీడపీడలు వాటికి ఆహారమవుతాయి. తద్వారా తదుపరి పంటకు ఎటువంటి రోగాలు వ్యాపించవు. అదే కాదు బాతులు తమ విసర్జకాలతో పొలాలను సారవంతం చేస్తాయి. అందువల్లే కేరళ రైతులు వరి సాగుకు ముందు ఇలా బాతులతో తమ పొలాలను శుభ్రం చేస్తుంటారు. గత కొంతకాలంగా ఈ ప్రక్రియ ఇక్కడ విజయవంతంగా సాగుతోంది. ఇక జపాన్, చైనా దేశాలలో కూడా ఇదే విధానాన్ని అక్కడి రైతులు అవలంబిస్తారు. అయితే వరి నాటి.. కలుపుదశ ముగిసిన తర్వాత బాతులను పొలాలలో తిప్పుతుంటారు. దీనివల్ల బాతులు పొలాలలో ఉన్న పురుగులను తినేస్తుంటాయి. అంతేకాదు ఎవరికీ హాని చేసే చీడపీడలను ఆరగిస్తుంటాయి. దీనివల్ల ఎటువంటి రసాయనాలు.. పురుగు మందులు వాడకుండానే చీడపీడలను నివారించవచ్చు. తద్వారా వాయు కాలుష్యాన్ని.. భూ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అయితే ఈ విధానాన్ని కేరళ రైతులు విజయవంతంగా అమలు చేస్తూ అధికంగా పంట దిగుబడి సాధిస్తున్నారు. ఇక ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ రైతులు అవలంబిస్తే వరి సాగులో ఎక్కువగా ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
Using ducks as natural pest control in rice fields
— Science girl (@gunsnrosesgirl3) April 27, 2025