Sanju Samson: అహ్మదాబాదులో బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచినప్పటికీ.. గుజరాత్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ (82: 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), షారుక్ ఖాన్ (36), బట్లర్ (36), రాహుల్ తేవాటియ (24*) అదరగొట్టడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తుషార్ దేశ్ పాండే, తీక్షణ చెరి రెండు వికెట్లు సాధించారు. ఆర్చర్, సందీప్ శర్మ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం 218 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రాజస్థాన్ జట్టులో హిట్ మేయర్ (52), సంజు శాంసన్(41) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. గుజరాత్ జట్టులో ప్రసిధ్ కృష్ణ 3, సాయి కిషోర్, రషీద్ ఖాన్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: గుజరాత్ విజయ ప్రస్థానం వెనుక ఇద్దరు తమిళ ‘‘సాయి’’లు!
24 లక్షలు గోవిందా
ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమితో పాటు మరో షాక్ కూడా ఆ జట్టుకు ఎదురయింది. ఈ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి పడిపోయింది. దాంతోపాటు ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ మ్యాచ్ ఫీజులో కోతపడింది. ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయం మేరకు ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ మ్యాచ్ ఫీజులో 24 లక్షలు కోత విధిస్తూ ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ జట్టుకు రెండు షాక్ లు తగిలినట్టు అయింది. గత సీజన్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా.. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తూ ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈ సీజన్లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు.. అతడి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ తొలి మ్యాచ్ కు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ లో స్లో ఓవర్ రేటు వల్ల నిర్వాహక కమిటీకి తీవ్రంగా నష్టం వస్తుంది. అందువల్లే స్లో ఓవర్ రేట్ ను ఏమాత్రం క్షమించదు. కెప్టెన్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడదు. ఇక ఈ సీజన్లో స్లో ఓవర్ రేటు వల్ల తొలిసారి ఫైన్ ఎదుర్కొన్న కెప్టెన్ సంజు శాంసన్ కావడం విశేషం.