IPL 2025: సొంత మైదానమైన అహ్మదాబాద్లో బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. గిల్, రషీద్, బట్లర్, సిరాజ్ మినహ పెద్దగా స్టార్లు లేకుండానే ఐపీఎల్ లో గుజరాత్ జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ను పంజాబ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండానే ఆడుతోంది. బలమైన ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తలపడి 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 58 పరుగుల తేడాతో విక్టరీని సొంతం చేసుకుంది. మొత్తంగా వరుసగా నాలుగు అతి భారీ విజయాలతో.. ఈ సీజన్లో ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గుజరాత్ జట్టు ఇదే జోరు గనుక కొనసాగిస్తే.. రెండవసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Also Read: మొన్న హార్దిక్.. నిన్న చాహల్.. నేడు శిఖర్ ధావన్.. సెలబ్రిటీలకు ఇది అలవాటే..
వారిద్దరే కీలకం
గుజరాత్ జట్టు సాధిస్తున్న విజయాలలో సాయి సుదర్శన్, సాయి కిషోర్ కీలకంగా మారారు.. ఓపెనర్ గా సాయి సుదర్శన్.. కీలకమైన బౌలర్ గా సాయికిషోర్ అదరగొడుతున్నారు. సాయి సుదర్శన్ గుజరాత్ జట్టు బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలగా మారాడు. ఇక సాయి కిషోర్ అద్భుతమైన బంతులు వేస్తూ మేటి బ్యాటర్లను సైతం బోల్తా కొట్టిస్తున్నాడు. వీరిద్దరూ తమ వంతు ప్రతిభ చూపిస్తే చాలు గుజరాత్ జట్టు సులువుగా గెలుస్తుందని అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. అటు సాయి సుదర్శన్.. ఇటు సాయి కిషోర్ ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అయితే వీరిద్దరూ గుజరాత్ జట్టు గెలుపులో కీలకంగా మారారు. గిల్ కూడా వీరిద్దరిపై అపారమైన నమ్మకం పెట్టుకున్నాడు. దానిని ప్రతి మ్యాచ్ లోను సాయి కిషోర్, సాయి సుదర్శన్ నిలబెట్టుకుంటున్నారు. గుజరాత్ జటను నిలబెడుతున్నారు.
పంజాబ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 74 పరుగులు చేశాడు. సాయి కిషోర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ 63 పరుగులు చేశాడు. సాయి కిషోర్ ఒక వికెట్ సాధించాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ 49 పరుగులు చేశాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో మాత్రం సాయి సుదర్శన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సాయి కిషోర్ మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు.
గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ 82 పరుగులు చేశాడు. బట్లర్, షారుక్ ఖాన్ తో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్లో సాయి కిషోర్ రెండు వికెట్లు సాధించాడు.
Also Read: సాయి సుదర్శన్.. మరో ఎబి డివిలియర్స్ అవుతాడా?