Sanju Samson: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సంజు శాంసన్ అదరగొడుతున్నాడు. ఈ జట్టుకు తొలి సీజన్ ఆడుతున్న అతడు ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆడిన ఏడు మ్యాచ్ లలో అతడు రెండు శతకాలు సాధించడం విశేషం.. చెన్నై జట్టులో గతంలో చాలామంది ప్లేయర్లు ఈ ఘనతను అందుకున్నప్పటికీ.. వారికి చాలా సమయం పట్టింది. షేన్ వాట్సన్ 43 ఇన్నింగ్స్ లు, విజయ్ 70 ఇన్నింగ్స్ లు, గైక్వాడ్ 77 ఇన్నింగ్స్ లు ఆడిన తర్వాత రెండు శతకాల ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు చేసిన ఐదవ ఆటగాడిగా ఇతడు రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ రెండు సీజన్లో, శిఖర్ ధావన్, రాహుల్, గిల్ తర్వాతి స్థానాలలో ఉన్నారు.
గురువారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో సంజు 54 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 101* పరుగులు చేశాడు. చెన్నై జట్టులో మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ… అతడు మాత్రం గట్టిగా నిలబడ్డాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రారంభంలో నిదానంగా బ్యాటింగ్ చేసిన అతడు.. ఆ తర్వాత తన జోరు చూపించాడు.. దీంతో చెన్నై జట్టు ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేశాడు.
208 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ముంబై జట్టు ఏ దశలో కూడా.. విజయం దిశగా సాగలేకపోయింది. చెన్నై బౌలర్లు అఖిల్ నాలుగు వికెట్లు పడగొట్టి.. ముంబై జట్టు పతనాన్ని శాసించాడు. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ముంబై జట్టు కేవలం 104 పరుగులకు ఆల్ అవుట్ అయింది. చెన్నై జట్టు 103 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు ద్వారా చెన్నై జట్టు ఏకంగా పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుంది.
సంజు అద్భుతంగా ఆడిన నేపథ్యంలో అతని మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. సంజు ను చెన్నై యాజమాన్యం రాజస్థాన్ నుంచి తీసుకోవడం మంచిదైందని.. అతని వల్ల చెన్నై జట్టు విజయాలు సాధించి.. టాప్ 5వ స్థానానికి చేరుకుందని.. ఇదే స్థాయిలో ఆడితే కచ్చితంగా ట్రోఫీ అందుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సంజు ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలని.. ధోని లెగస్సీ ని కొనసాగించాలని చెన్నై అభిమానులు కోరుతున్నారు.