Sanju Samson salary 24.23 crore: పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఓడిన వాడు ఎప్పుడూ గెలుపునకు దూరంగా ఉండలేడు. ఈ మాటలు సంజు శాంసన్ కు నూటికి నూరుపాళ్ళు సరిపోతాయి. ఎందుకంటే అండర్ డాగ్ గా వచ్చిన అతడు.. టి20 వరల్డ్ కప్ లో సూపర్ ప్లేయర్ గా ఆవిర్భవించాడు.
టీమిండియా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. వరుసగా మూడు మెరుపు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అవి కూడా బలమైన వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మీద చేశాడు. వెస్టిండీస్ మీద 97*, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మీద 89 పరుగులు చేసి అదరగొట్టాడు. సంజు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో టీమిండియా విజయాలను అందుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. టి20 వరల్డ్ కప్ ను వరుసగా రెండవసారి సొంతం చేసుకొని.. టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.
Also Read: బెంగళూరు మరోసారి భళా అనిపిస్తుందా? జట్టు సామర్థ్యం, బలహీనతలు ఇవే!
టీమిండియా విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించినందుకు సంజు శాంసన్ కు మెన్ అఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. ఈ క్రమంలోనే సంజు పంట పండుతోంది. ఏకంగా అతడు 24.23 కోట్లను ఈ ఏడాది సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ 2026 లో అతడు చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. చెన్నై జట్టు అతడికి 18 కోట్లను చెల్లిస్తోంది. టి20 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ప్రైజ్ మనీ రూపంలో బీసీసీఐ సంజు కు ఆరు కోట్లను ఇస్తోంది. ఇక ఐసిసి టి20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూపంలో 23 లక్షల ఇస్తుంది. మొత్తంగా అతడు 24.23 కోట్లను సంపాదిస్తున్నాడు.
వాస్తవానికి తన స్థాయి ఆటగాళ్లతో పోల్చి చూస్తే సంజు ఏకంగా 24.23 కోట్లను సంపాదించడం నిజంగా గొప్ప విషయం. టి20 వరల్డ్ కప్ లో రింకు సింగ్ విఫలం కావడం.. అభిషేక్ శర్మ కొన్ని మ్యాచ్లలో చేతులెత్తేయడంతో సంజు కు జట్టులో అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సంజు సద్వినియోగం చేసుకున్నాడు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు.. జట్టు విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. కీలకమైన ప్లేయర్లు చేతులెత్తేసిన వేళ.. అతడు దీపశిఖలాగా నిలబడ్డాడు.