Salman Nizar: ఏం కొట్టుడు అది.. మామూలు కొట్టుడు కాదు.. భయం అనేది అతనికి తెలియనట్టు.. బంతి అంటే లెక్కే లేనట్టు.. బౌలర్ అంటే ఏమాత్రం గౌరవం లేనట్టు.. దంచి దంచి కొట్టాడు. బంతి వేయడమే ఆలస్యం బౌండరీకి వెళ్ళింది. ఇలా అతడి బ్యాట్ నుంచి విధ్వంసం నమోదయింది. ఫైర్ క్రాకర్ ఇన్నింగ్స్ తో అతడు చెలరేగిపోతుంటే మైదానంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం అలా చూస్తూ ఉండిపోయారు.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
పొట్టి ఫార్మాట్ ఆవిర్భవించిన తర్వాత రకరకాల లీగ్ లు తెరపైకి వస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత మనదేశంలో లీగ్ ల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం కేరళ వేదికగా కేరళ క్రికెట్ లీగ్ కొనసాగుతోంది. ఈ లీగ్ లో వరల్డ్ రికార్డులు బద్దలయ్యాయి. కాలికట్ గ్లోబ్ స్టర్స్ ఆటగాడు సల్మాన్ నిజార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అదాని త్రివేండ్రం రాయల్స్ జట్టుపై 12 బంతుల్లోనే 11 సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముందుగా తాను ఎదుర్కొన్న 13 బాల్స్ లో 17 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తదుపరి 13 బంతుల్లో 69 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో కాలికట్ 6 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. టి20 చరిత్రలో చివరి రెండు భవన్లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 71 పరుగులు చేయలేదు. ఆ ఘనత కాలికట్ జట్టుకే దక్కింది.
One man. One over. Five rockets launched into orbit.
Salman Nizar just turned the 19th into a massacre!#KCLSeason2 #KCL2025 pic.twitter.com/up2rGcTdqU— Kerala Cricket League (@KCL_t20) August 30, 2025
తొలుత తాను కుదురుకోవడానికి సల్మాన్ కాస్త సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత మైదానాన్ని అంచనా వేసి బ్యాట్ ను వీర లెవెల్ లో తిప్పాడు. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా దూకుడు తీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 12 బంతుల్లో 11 సిక్సులు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా కాలికట్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. వాస్తవానికి టి20 చరిత్రలో ఈ స్థాయిలో ఏ జట్టు కూడా పరుగులు చేయలేదు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో ఏకంగా 71 పరుగులు వచ్చాయంటే.. కాలికట్ జట్టు బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సల్మాన్ అదిరి పోయే రేంజ్ లో బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడిని కీర్తిస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అద్భుతంగా బ్యాటింగ్ చేశావని.. కచ్చితంగా నీకు టీమిండియాలో చోటు లభిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే సీజన్ కు సంబంధించి మినీ వేలం జరుగుతున్న నేపథ్యంలో.. కచ్చితంగా సల్మాన్ కు ఐపీఎల్ లో ఏదో ఒక జట్టులో చోటు లభిస్తుందని కేరళ క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.