Saina Nehwal : సైనా నెహ్వాల్ కు ప్రస్తుతం 34 సంవత్సరాలు. ఆమె తన సహచర బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ను డిసెంబర్ 16, 2018 న వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన తర్వాత కూడా బ్యాడ్మింటన్ కొనసాగించింది. ఈలోగా సింధు వెలుగులోకి రావడంతో సైనా ఫేడ్ ఔట్ అయిపోయింది. ఈ దశలోనే ఆమెను కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆమె కోచ్ ను మార్చుకుంది. వేరే కోచ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంది. కొద్దిరోజులు బెంగళూరులో ఉంది. ఇక ఇటీవల టీం ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా పై సంచలన వ్యాఖ్యలు చేసింది..నేను షాట్లు సంధిస్తే బుమ్రా తట్టుకోగలడా అంటూ వ్యాఖ్యానించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇది ఇలా ఉండగానే సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివర్లో తాను ఆటకు స్వస్తి పలుకుతానని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు. ” నేను చాలా రోజులుగా ఆర్థరైటిస్ తో బాధపడుతున్నాను. అందువల్లే ఆటకు వీడ్కోలు పండగ తప్పడం లేదని” సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.
బ్యాడ్మింటన్ స్టార్
ఒలింపిక్ చరిత్రలో బ్యాడ్మింటన్లో భారతదేశానికి తొలి మెడల్ అందించిన ఘనత సైనా నెహ్వాల్ ది. 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఆమె కాంస్యం దక్కించుకుంది. గతంలోనూ ఆమె వరల్డ్ నెంబర్వన్ ర్యాంకర్ గా కొనసాగింది. కామన్వెల్త్ 2010, 18 సీజన్లలో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకుంది. కొంతకాలంగా ఆమె టోర్నీలకు దూరంగా ఉంటున్నది. గాయాల వల్లే ఆమె విరామం తీసుకుంది. సైనా నెహ్వాల్ ప్రస్తుతం తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతోంది. ఆర్థరైటిస్ కూడా ఆమెను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి స్థితిలో ఆమె రోజుకు 8 నుంచి 9 గంటలపాటు ప్రాక్టీస్ చేయడం అంత సులభం కాదు. అందువల్లే ఆటకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది.
తొమ్మిదో సంవత్సరంలో..
సైనా నెహ్వాల్ తన తొమ్మిదవ సంవత్సరంలో బ్యాడ్మింటన్ లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు. వయసు పరంగా చూసుకుంటే ఆమె మోకాలి గుజ్జు అరిగిపోయే దశలో ఉన్నట్టే. ఇలాంటి స్థితిలో ఆమె కోర్టులో ప్రత్యర్థులపై పై చేయి సాధించడం దాదాపు అసాధ్యం. అలాంటప్పుడు ఆమె అనుకున్న ఫలితాలు రాబట్టడం సులభం కాదు. అందుకే ఆటకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. సైనా నెహ్వాల్ సుదీర్ఘకాలం షట్లర్ గా కొనసాగింది. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. తన రిటైర్మెంట్ పై భారత షూటర్ గగన్ నారాయణ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో ఈ వివరాలు వెల్లడించింది.. సైనా నెహ్వాల్ ఆట తీరని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున, ఖేల్ రత్న నమస్కారాలను అందించింది. సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం, రజతం, కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో కాంస్యం, ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో రజతం, సూపర్ సిరీస్ ఫైనల్స్ లో రజత పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Saina nehwal reveals struggles with arthritis to decide on retirement by end of year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com