Retirement: జీవితంలో ఎంతో కష్టపడతారు.. ఉన్నత స్థాయికి చేరుకుంటారు.. కావలసినంత డబ్బు సంపాదిస్తారు.. అయితే ఈ ప్రయాణంలో చివరి మజిలీ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం చేసిన వారు ఎవరైనా రిటర్మెంట్ సమయంలో హాయిగా జీవించాలని అనుకుంటారు. అందుకోసం ముందే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పటి వారు రిటైర్మెంట్ తర్వాత గ్రామాల్లో జీవించేవారు. కానీ నేటి యువత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ముందే ప్లాన్ చేసుకుంటుంది. ఇలా ప్లాన్ చేసుకునే వారు కొన్ని ఏ వాతావరణం లో ఉంటే బాగుంటుంది? అని అనుకునే వారికి చక్కటి ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. మరి ఆ ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
కొంతమందికి బీచ్ ల సమీపంలో ఉండడం ఇష్టం.. మరికొందరు పచ్చని అడవిలో జీవించాలని అనుకుంటారు.. ఇంకొందరు కొండలపైన నివసించాలని కోరుకుంటారు.. వీటిలో ఎత్తైన ప్రదేశంలో ఉండడంవల్ల సరైన గాలి, సూర్య రశ్మి వంటివి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇలా ఎత్తైన ప్రదేశంలో ఉండాలని కోరుకునే వారికోసం డెహ్రాడూన్ ఆహ్వానం పలుకుతుంది. ఈ ప్రదేశాల్లో నివసించడం వల్ల హాయిగా ఉండగలుగుతారు. అంతేకాకుండా ఇక్కడ స్థిరాస్తుల ధరలు కూడా కన్వీనెంట్ గానే ఉంటున్నాయి. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోని ఆకట్టుకునే ప్రాంతం. ఇక్కడికి రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా ప్రాంతం కూడా ఎత్తైన ప్రదేశంలో ఉండి. ఇక సౌత్ రాష్ట్రం అయినా కర్ణాటకలో కూర్గ్ అనే ప్రాంతం గుట్టల పైన ఉండి ఆహ్లదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కాఫీ తోటలు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
పదవి విరమణ పొందిన తర్వాత కొంతమంది ఆధ్యాత్మిక వాతావరణాన్ని కోరుకుంటారు. దేవాలయాలు, దైవచింతన కోరుకునే వారికోసం మన దేశంలో హరిద్వార్. ఇక్కడ గంగానది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది సమీపాన అనేక ఆలయాలు ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆధ్యాత్మిక చింతన కోరుకునే వారి కోసం ఈ ప్రదేశం అనువుగా ఉంటుంది. అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే రిషికేశ్ లో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ యోగా కేంద్రాలు కూడా ఉన్నాయి. చివరి మజిలీ ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వారి కోసం ఇక్కడ యోగ ఎంతో అణువుగా ఉంటుంది. ఇక నిత్యం నమశ్శివాయ స్మరణ అయ్యే వారణాసి కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. పూర్వకాలంలో కొందరు తమ చివరి జీవితాన్ని ఇక్కడే గడిపి ఆ తర్వాత ప్రాణాలు విడిచేవారు. అయితే ఇప్పుడు కూడా ఈ ప్రదేశంలో ఉండి హాయిగా ఉండాలని కోరుకుంటూ ఉండొచ్చు.
కొండల ప్రాంతంలో ఎంత హాయిగా ఉంటుందో.. సముద్ర తీరాన కూడా అంతే హాయిగా కనిపిస్తుంది. ఇటువంటి ప్రదేశాల్లో జీవించాలని అనుకునే వారికి గోవాది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. అయితే పంజిమ్,ముపుసా ప్రాంతంలో పెద్దగా అలజడి ఉండకపోవచ్చు. కానీ ఈ నగరాలు సముద్రం తీరంలో ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాగే పుదుచ్చేరిలో కూడా సముద్రం ఒడ్డున నివసించే అవకాశం ఉంటుంది. కేరళలోనూ కొచ్చి ప్రాంతంలో సముద్రపు బ్యాక్ వాటర్ ఉండి ప్రశాంతతను కలిగిస్తాయి.