SA W Vs Eng W Semi Final: ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఆతిధ్య భారత జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతూ ఉంటే.. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రయాణం మాత్రం కేక్ వాక్ లాగా సాగుతోంది. ఈ జట్టు లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ కు దాసోహమైంది. 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ జట్టు లీగ్ నుంచే ఇంటికి వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ జట్టు ఆ ఓటమి నుంచి బలమైన గుణపాఠం నేర్చుకుంది. తద్వారా సూపర్ ఆటతీరుతో ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది.
Also Read: కేసీఆర్ కు ఏమైంది? ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు దాస్తున్నారు?
సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును 125 పరుగుల తేడాతో ఓడించింది. లీగ్ దశలో ఇంగ్లాండ్ జట్టు చేతిలో దక్షిణాఫ్రికా 69 పరుగులకే కుప్పకూలింది. ఆ ఓటమి దక్షిణాఫ్రికా జట్టులో కసిని పెంచింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బ్యాటింగ్లో ఆకట్టుకున్నారు. బౌలింగ్లో దుమ్మురేపారు. ఫీల్డింగ్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు అత్యంత బలంగా మారింది. ప్రస్తుతం ఫైనల్ దాకా వెళ్ళిపోయింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై సూపర్ ఆట తీరుతో ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ వాల్వర్డ్ 169 పరుగులు చేసి అదరగొట్టింది. సోఫీ నాలుగు వికెట్లు పడగొట్టింది.
320 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 194 పరుగులకు కుప్ప కూలింది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్లు, వన్ డౌన్ ప్లేయర్ డక్ ఔట్ కావడం విశేషం. బ్రాంట్ 64, క్యాప్సీ 50, హడ్జ్ 34 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్ జట్టుకు అవి ఏమాత్రం ఉపయోగపడలేదు. కాప్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించింది. లీగ్ దశలో ఇంగ్లాండ్ జట్టు పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిస్తే.. అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్టులో 125 పరుగుల తేడాతో ఓడించింది. ట్రోఫీ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
ఇక ఈ మ్యాచ్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా కాప్(44 వికెట్లు) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టి.. భారత ప్లేయర్ జూలన్ గోస్వామి (43 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టింది. వీరిద్దరి తర్వాతి స్థానాలలో లిన్ ఫుల్ స్టన్(39 వికెట్లు), మేఘన్ షూట్(39 వికెట్లు), కరోల్ (37 వికెట్లు) , సోఫీ (37 వికెట్లు) కొనసాగుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో కాప్ 42 పరుగులు కూడా చేయడం విశేషం.