KCR Health: ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కెసిఆర్.. ప్రతిరోజు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ. ఆయన తెలంగాణ రాజకీయాలలో కనిపిస్తారు. దీనిని బట్టి కెసిఆర్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కెసిఆర్ సైలెంట్ గా ఉన్నా తెలంగాణ రాజకీయాలు ప్రభావితమవుతాయి. కెసిఆర్ చైతన్యవంతంగా ఉన్నా తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారతాయి.
తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించే కేసీఆర్ కు ఏమైంది? ఆయన ముఖంలో ఒకప్పటి కాంతి కనిపించడం లేదు. కర్ర సహాయంతోనే ఆయన నడుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కెసిఆర్ ముఖం నీరసంగా మారిపోయింది. గడ్డం గీసుకోకపోవడంతో పెరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు కేసీఆర్ ముఖం దీప శిఖలాగా వెలిగిపోతూనే ఉంది. అయితే తొలిసారి ఉద్యమకాలం నాటి కేసీఆర్ కనిపించారు. ఇది ఆయన అభిమానులకే కాదు.. కార్యకర్తలకు కూడా ఇబ్బందికరంగా మారింది. సగటు తెలంగాణ వాసి కూడా కేసీఆర్ ముఖ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారంటూ చర్చించుకుంటున్నారు.
హరీష్ రావు తండ్రి కన్నుమూసిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కేసీఆర్ కోకాపేటకు వచ్చారు. చేతి కర్ర సహాయంతో నడుచుకుంటూ వచ్చారు. గడ్డం కూడా పెరిగింది. ముఖం కూడా కళావిహీనంగా మారిపోయింది. కెసిఆర్ ను అలా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలా అయిపోయారు ఏంటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల కెసిఆర్ అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన పలుమార్లు వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. కెసిఆర్ ఆరోగ్యం పట్ల కూడా అధికార పక్ష నాయకులు రకరకాల విమర్శలు చేశారు. చివరికి రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ పై కుటుంబ సభ్యులు కుట్రలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
కెసిఆర్ కుటుంబంలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కుమార్తె ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది.. కుమార్తె కవిత కూడా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. తన సొంత జిల్లా అయిన నిజామాబాదులో జాగృతి ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమం చేపడుతున్నారు.. గడచిన పది సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం చేయలేని పనులను ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మందు ఇది ఒక రకంగా గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గులాబీ పార్టీలో ఉన్న కీలక నాయకులను ఆమె తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన ఓటమికి కారణమయ్యారని మండిపడుతున్నారు.
కెసిఆర్ పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ.. పార్టీలో పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కవిత అంటే కెసిఆర్ కు విపరీతమైన ఇష్టం. అందువల్లే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా బాధపడిపోయారని పార్టీ అంతరంగిక వర్గాలు అంటున్నాయి. అందువల్లే ఆయన ఇలా అయిపోయారని పేర్కొంటున్నాయి. ఇది ఏమైనప్పటికీ కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని.. తెలంగాణ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.