India Vs South Africa Test: ఇండియా సౌతాఫ్రికా తో ఆడుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్లందరూ కూడా చాలా తక్కువ స్కోరులకే అవుట్ అయిపోవడంతో ఇండియన్ టీం పెలవమైన పర్ఫామెన్స్ ని ఇవ్వటమే కాకుండా టెస్ట్ మ్యాచ్ ల్లో దారుణంగా ఓడిపోబోతుంది అని సూచనలు కూడా అందాయి. అయినప్పటికీ కే ఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించి టీం కి గౌరవప్రదమైన స్కోర్ ని అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. రాహుల్ సెంచరీ తో ఇండియన్ టీం 245 పరుగులు చేయగలిగింది.
రాహుల్ టీమ్ లో లేకపోయి ఉంటే మాత్రం ఇండియన్ టీం దారుణంగా విఫలం అవ్వడమే కాకుండా మ్యాచ్ దారుణమైన ఓటమిని కూడా చవిచూసి ఉండేదని పలువురు మాజీ క్రికెటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి రాహుల్ టెస్ట్ మ్యాచ్ ల్లో సరిగా రాణించడం లేదు.ఆయన ఏమాత్రం ఇంపాక్ట్ చూపించడం లేదంటూ ఆయన మీద దారుణమైన ట్రోలింగ్స్ కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ ఎట్టకేలకు ఇప్పుడు సెంచరీ చేసి తన సత్తాను చాటుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించి ఒక అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు…
ఇక దీంతో రాహుల్ టెస్టుల్లో తన ఎనిమిదవ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 101 పరుగులు చేసిన రాహుల్ నండ్రే బర్గర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక తన శతకానికి చాలా వాల్యూ ఉండడమే కాకుండా ఇండియన్ టీం గౌరవాన్ని సౌతాఫ్రికా గడ్డమీద నిలబెట్టిన ప్లేయర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియన్ టీం 245 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా టీం బ్యాటింగ్ కి వచ్చి ఒక వికెట్ కోల్పోయింది…ప్రస్తుతం సౌతాఫ్రికా టీమ్ స్కోర్ ఒక వికెట్ నీ కోల్పోయి 49 పరుగులు చేసింది…
ఇక దీంతో ఇండియన్ టీం ఈ టెస్ట్ మ్యాచ్ మీద ఆధిపత్యాన్ని చూపించే అవకాశం అయితే ఉంది.మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండియన్ టీం ప్లేయర్లందరు కలిసికట్టుగా ఆడి ఈ మ్యాచ్ లో విజయం సాదిస్తారని ప్రతి ఒక్క ఇండియన్ అభిమాని కూడా కోరుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు అద్భుతమైన బౌలింగ్ ని కనబర్చి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి విజయం సాధించాలని కోరుకుందాం…