https://oktelugu.com/

Sri Satya: నాకు కొరియన్ మొగుడు కావాలి… బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ కోరిక! వీడియో వైరల్

గేమ్ కోసం మాత్రం అర్జున్ కళ్యాణ్ వీక్నెస్ ని వాడేసింది. మనోడు తన కోసం ఆడటం మానేసి శ్రీసత్య కోసం ఆడాడు. దాంతో ప్రేక్షకులు త్వరగా ఇంటికి పంపేశారు. అర్జున్ 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2023 / 06:49 PM IST

    Sri Satya

    Follow us on

    Sri Satya: బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య భర్తగా కొరియన్ కావాలని చెప్పడం షాకింగ్ గా మారింది. ఆమె కోరిక విని జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్ట్ చేసింది శ్రీసత్య. అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. శ్రీసత్య బిహేవియర్ జనాలకు నచ్చలేదు. ఈమె మాయలో పడి అర్జున్ కళ్యాణ్ దెబ్భై పోయాడు. హౌస్లో అడుగుపెట్టిన నాటి నుండి శ్రీసత్య చుట్టే తిరిగాడు. నాకు లవ్ బ్రేకప్ అయ్యింది. నేను ఎవరితో కలవనంటూ శ్రీసత్య షో చేసింది.

    గేమ్ కోసం మాత్రం అర్జున్ కళ్యాణ్ వీక్నెస్ ని వాడేసింది. మనోడు తన కోసం ఆడటం మానేసి శ్రీసత్య కోసం ఆడాడు. దాంతో ప్రేక్షకులు త్వరగా ఇంటికి పంపేశారు. అర్జున్ 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు. వెళ్తూ శ్రీసత్య కోసం చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. అసలు షోకి నీకోసమే వచ్చానంటూ అసలు మేటర్ బయటపెట్టాడు. నీకోసం బయట పని చేస్తా అంటూ హామీ ఇచ్చాడు.

    అర్జున్ ఎలిమినేట్ అయ్యాక అనూహ్యంగా శ్రీహాన్ కి కనెక్ట్ అయ్యింది. ఫ్రెండ్షిప్ అంటూ సీక్రెట్ గా రొమాన్స్ చేసేవాళ్ళు. అదే విషయం ఇతర కంటెస్టెంట్స్ అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. శ్రీసత్య కారణంగా శ్రీహాన్ గేమ్ గతి తప్పింది. ఫ్యామిలీ వీక్ లో శ్రీహాన్ లవర్ సిరి ఎంట్రీ ఇచ్చి వార్నింగ్ ఇచ్చింది. ఆమె వలన నువ్వు నెగిటివ్ అవుతున్నావని చెప్పింది. తర్వాత ఆటపై ఫోకస్ పట్టి శ్రీహాన్ రన్నర్ అయ్యాడు.

    శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది. నిజానికి ఆమెపై ఉన్న నెగిటివిటీకి అన్ని వారాలు ఉండటమే ఎక్కువ, ఈ మధ్య శ్రీసత్య బుల్లితెర మీద సందడి చేస్తుంది. బీబీ జోడిలో మెహబూబ్ తో పాటు జతకట్టి పార్టిసిపేట్ చేసింది. ఈ షో కోసం ఆమె చాల కష్టపడింది. తాజాగా సుమ షోలో పాల్గొన్న శ్రీసత్య కామెంట్ అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. నీకు ఎలాంటి మొగుడు కావాలి? అని సుమ అడగ్గా.. నాకు కొరియన్ మొగుడు కావాలని చెప్పింది. ఆమె క్రేజీ కోరిక విని షోలో వాళ్లంతా గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.