Prabhas Spirit: స్పిరిట్ సినిమా కి ప్రభాస్ రెమ్యున్ రేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…

నిజానికి ప్రభాస్ సలార్ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని తన రెమ్యూన్ రేషన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కలిపి దాదాపు 200 కోట్ల వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.

Written By: Gopi, Updated On : December 27, 2023 6:39 pm

Prabhas Spirit

Follow us on

Prabhas Spirit: మొదట పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్… ఈయన నటించిన సలార్ సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి నెక్స్ట్ తను చేయబోయే స్పిరిట్ సినిమా మీదనే ప్రతి ఒక్కరి చూపు ఉంది.

ఎందుకంటే ఒకే నెలలో అటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి తన కెరియర్లో భారీ కలక్షన్స్ ని రాబడుతున్నాడు.ప్రభాస్ కూడా ఈ సంవత్సరంలో ఒకే నెలలో వచ్చి వాళ్ల సినిమాలతో సక్సెస్ సాధించి చూపించారు. కాబట్టి ఈ కాంబో ఇప్పుడు కలిసి సినిమా చేయబోతుంది ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనడమే కాకుండా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడానికి వీళ్ళిద్దరూ కూడా వాళ్ల పూర్తి ఎఫర్ట్ పెట్టడానికి కూడా సిద్దం గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమా కోసం రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అనే దాని మీదనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి.

నిజానికి ప్రభాస్ సలార్ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని తన రెమ్యూన్ రేషన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కలిపి దాదాపు 200 కోట్ల వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి ప్రభాస్ 200 కోట్ల వరకు రెమ్యున్ రేషన్ ని తీసుకుంటున్నాడు అనే టాక్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తుంది. నిజానికి ప్రభాస్ తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్లు సేఫ్ గానే ఉంటారు ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి సినిమా కొంచెం బాగున్న కూడా ఆ సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబడుతాయి కాబట్టి అందుకే ఆయనకు 200 కోట్లు ఇచ్చి మిగతా సినిమాని 200 కోట్లలలో కంప్లీట్ చేసిన కూడా మొత్తం 400 కోట్ల వరకు ఖర్చవుతుంది.

ఇక సినిమా బాగుంది అనే టాక్ వస్తే వన్ వీక్ లోనే ఈ కలక్షన్స్ మొత్తాన్ని సినిమా రాబడుతుంది. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఎదురుచూస్తున్నారు.ఇక 200 కోట్ల రెమ్యూన్ రేషన్ తీసుకున్న ఏకైక ఇండియన్ హీరోగా కూడా ప్రభాస్ తనదైన రికార్డుని క్రియేట్ చేయబోతున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు…