https://oktelugu.com/

SA vs BAN : బంగ్లా బౌలర్ల ధాటికి.. దక్షిణాఫ్రికా బెంబేలు.. 113కే పరిమితం

న్యూయార్క్ మైదానంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. మైదానంపై ఊహించని బౌన్స్ వల్ల వికెట్ల మీద వికెట్లు పడ్డాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2024 / 10:23 PM IST

    SA vs BAN

    Follow us on

    SA vs BAN : టి20 క్రికెట్లో పెను సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా జట్టు పాకిస్తాన్ ను ఓడించింది. స్కాట్లాండ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బంగ్లాదేశ్ శ్రీలంకను పడుకోబెట్టింది.. న్యూజిలాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ అల్లాడించింది. దీంతో పెద్ద పెద్ద జట్ల భవితవ్యం ప్రమాదకర స్థితిలో పడింది.. లీగ్ దశ నుంచే ఇంటికి వెళ్లే పరిస్థితి నెలకొంది. అయితే ఈ సంచలనాలు ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం సాయంత్రం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా ఆద్యంతం ఇలానే సాగుతోంది.

    న్యూయార్క్ మైదానంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. మైదానంపై ఊహించని బౌన్స్ వల్ల వికెట్ల మీద వికెట్లు పడ్డాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు హసన్ షకీబ్ నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తుండడంతో దక్షిణాఫ్రికా 113 పరుగులకే పరిమితమైంది.

    క్లాసెన్ , డేవిడ్ మిల్లర్  ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ రిషిద్ హొస్సేన్ వేసిన పదో ఓవర్ లో క్లాసెన్ కొట్టిన సిక్సర్ కు బంతి 91 మీటర్ల ఎత్తులో ఎగిరింది. ఏకంగా స్టాండ్స్ లో పడింది.

    ఈ మైదానంపై టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫీల్డింగ్ కు బదులు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానం సహకరించడంతో బంగ్లా బౌలర్లు బౌన్స్ రాబట్టారు. దీంతో బ్యాటర్లు ఎక్కువసేపు క్రీ జ్ లో ఉండలేకపోతున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ హెండ్రిక్స్ 0 పరుగులకే మరోసారి అవుట్ అయ్యాడు. షకీబ్ బౌలింగ్లో అతడు ఎల్బిడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 18 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 19 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను.. తస్కిన్ చావు దెబ్బ కొట్టాడు. కెప్టెన్ ఎడెన్ మార్క్రమ్ (4) ను పెవిలియన్ పంపించాడు. ప్రమాదకరమైన ట్రిస్టన్ స్టబ్స్ (0) ను సైతం అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా  113 పరుగులకే పరిమితమైంది