Mazaka Movie In OTT
Mazaka Movie : సందీప్ కిషన్(sundeep kishan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Mazaka Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కామెడీ పేలినప్పటికీ, మిగిలిన సన్నివేశాల్లో ఆశించిన స్థాయిలో కామెడీ పేలకపోవడంతో ఈ చిత్రం టార్గెట్ ని మిస్ అయ్యింది. సందీప్ కిషన్ ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఆయన రేంజ్ మరో లెవెల్ కి వెళ్తుంది అనుకున్నాడు కానీ అది జరగలేదు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకు జరిగితే, మొదటిరోజు కేవలం కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. లాంగ్ వీకెండ్ కావడంతో 50 శాతం కి పైగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ, పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే అనుమానమే.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని జీ 5 సంస్థ మంచి రేట్ కి కొనుగోలు చేసింది. వీకెండ్ తర్వాత ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ వచ్చే అవకాశాలు లేనందున నాలుగు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలంలో కొత్త సినిమాలన్నీ ఎక్కువగా జీ5 సంస్థ కొనుగోలు చేయడం గమనార్హం. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సంస్థలతో పోటీ పడేందుకు ఈ సంస్థ ఈ ఏడాది గట్టి ప్లాన్ వేసింది. ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఈ జీ5 యాప్ లోనే అందుబాటులోకి రానుంది. ఇలా కొత్తగా విడుదలయ్యే సినిమాలన్నీ ఈ యాప్ సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ‘మజాకా’ చిత్రానికి థియేటర్స్ లో ఎలాంటి ఫలితం దక్కినా ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఎందుకంటే ఈమధ్య కాలంలో జనాలు మీడియం రేంజ్ హీరోలకు పాజిటివ్ టాక్ వస్తే థియేటర్స్ కి కదులుతున్నారు కానీ యావరేజ్ టాక్ వచ్చినప్పుడు మాత్రం ఓటీటీ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే అభిప్రాయం తో ఉండిపోతున్నారు. ఫలితంగా ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తున్నాయి. అయితే మజాకా మూవీ స్టోరీ ముందుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ని పెట్టి చేద్దాం అనుకున్నారట. కానీ చివరి నిమిషం లో చిరంజీవి ఇది నాకు వర్కౌట్ అవ్వదు అని తప్పుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ త్రినాధరావు నక్కిన రచయిత ప్రసన్న కుమార్ కి రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు ఇచ్చి ఈ కథని కొనుగోలు చేశారట. ధమాకా లాగా సక్సెస్ అయిపోతుందని అనుకున్నారు కానీ మిస్ ఫైర్ అయిపోయింది. చూడాలిమరి ఈ మూవీ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
Also Read : ఎట్టకేలకు ‘కుబేర’ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం..అక్కినేని ఫ్యాన్స్ కల ఈసారైనా నెరవేరుతుందా?