RR vs RCB IPL 2024 : బంతులు వేసి బౌలర్లకు అలుపు వచ్చింది. బంతులను ఆపలేక ఫీల్డర్లకు విసుగు వచ్చింది. కానీ అతడికి వీసమెత్తు నీరసం రాలేదు. కొంచెం కూడా ఓపిక నశించలేదు. ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చిన అతడు.. చివరి వరకు ఉన్నాడు. ఎదురైన ప్రతి బంతిని కసితీరా బాదాడు.. అయితే ఫోర్ లేకుంటే సిక్స్.. బంతి మీద ఏదో కోపం ఉన్నట్టు.. బౌలర్ తో విరోధం ఉన్నట్టు.. బ్యాట్ తో తాండవం చేశాడు.. ఐపీఎల్ 17వ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడే కింగ్ కోహ్లీ.. పరుగుల యంత్రంగా, కింగ్ గా తనను ఎందుకు పిలుస్తారో.. శనివారం నాటి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 17వ సీజన్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.. కోహ్లీ ఐపిఎల్ కెరియర్ లో ఇది ఎనిమిదవ సెంచరీ కావడం విశేషం. 39 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ.. దానిని సెంచరీగా మలిచాడు. వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 113 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్ ఓపెనింగ్ జోడీగా వచ్చారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేసి బెంగళూరు జట్టుకు శుభారంభాన్ని అందించారు. 44 పరుగులు చేసిన డూ ప్లెసిస్ క్యాచ్ అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన మాక్స్ వెల్ ఈ మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. బర్గర్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సౌరవ్ చౌహన్ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. మైదానం అంతగా సహకరించకపోవడంతో బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మినహా మిగతావారు భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
"I've still got it, I guess." ❤️#RRvRCB #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/XdO7AmVq5l
— JioCinema (@JioCinema) April 6, 2024
ఈ మ్యాచ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ- డూ ప్లెసిస్ బ్యాటింగ్ గురించి.. ఈ సీజన్లో మొదటి వికెట్ కు ఇప్పటివరకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా వీరిద్దరు నిలిచారు. 84 బంతుల్లో తొలి వికెట్ కు 125 పరుగులు జోడించారు.. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్ కెరియర్ లో 7,500 పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. ఈ ఘనతను సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. మ్యాచ్ చివరి వరకు ఉన్నాడు.. 72 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశ పరిచినప్పటికీ.. జోస్ బట్లర్(59), సంజూ సాంసన్(65) క్రీజ్ లో కొనసాగుతున్నారు. రాజస్థాన్ విజయానికి 45 బంతుల్లో 56 పరుగులు అవసరం.
EIGHTH hundred for Virat Kohli in the IPL
T20 Cricket or Test or ODI: 1️⃣ G.O.A.T #PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB @imVkohli pic.twitter.com/hc5sHqBatO
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024