Horoscope Today: 2024 ఏప్రిల్ 7న ద్వాదశ రాశులపై పూర్వభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. అమావాస్య సమీపిస్తున్న వేళ కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగనున్నాయి. మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆదివారం చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆరోగ్యంపై నిర్లక్ష్యంచేయొద్దు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమై నిర్ణయాలు తీసుకునే తీసుకునేటప్పుుడు జాగ్రత్త. ఓ సమాచారం నిరాశను కలిగిస్తుంది.
వృషభ రాశి:
మిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం. కుటుంబానికి సంబందించిన ఓ పనిని పూర్తి చేస్తారు.
మిథునం:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
కర్కాటకం:
వివిధ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులతో పాటు వ్యాపారులకు కొన్ని పనులు కలిసి వస్తాయి. ఎదైనా పనికి అడ్డంకులు తగిలినా ముందుకు వెళ్లాలి..
సింహ:
ఆస్తుల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మనసులోని కోరికలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇంట్లో వ్యవహారలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కన్య:
కెరీర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విహార యాత్రలకు వెళ్తారు. సమాజంలో సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ సభ్యులతో మద్దతు ఉంటుంది.
తుల:
కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారికి ఆదాయం బాటుంటుంది. వ్యక్తి గత విషయాలపై ఇతరులకు దూరంగా ఉండాలి.
వృశ్చికం:
ఉద్యోగులు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. ఎదైనా పెట్టుబడుల గురించి ఇతరుల సలహా తీసుకోండి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
ధనస్సు:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో భాగస్వాములకు ఎక్కువగా నమ్మొద్దు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
మకర:
ఈ రాశి ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని పూర్తి చేయగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మద్దతు ఉంటుంది.
కుంభం:
భవిష్యత్ కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. బాధ్యతలను పూర్తి చేయడానికి దృష్టి పెట్టాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
మీనం:
ఈ రాశి వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. కొన్ని పాత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పనిపై పూర్తి పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారు.