Jos Buttler: విరోచిత సెంచరీ తో.. బట్లర్ దిగ్గజాల రికార్డులు మడత పెట్టాడు..

ఈ సీజన్లో ఇప్పటికే బట్లర్ సెంచరీ పూర్తి చేశాడు. మంగళవారం రాత్రి కోల్ కతా జట్టు పై ఊహించని విధంగా సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 17, 2024 3:28 pm

Jos Buttler

Follow us on

Jos Buttler: కోల్ కతా తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆరు కీలక వికెట్లు పోగొట్టుకున్నప్పటికీ.. విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆరు ఓవర్లలో 96 పరుగులు చేసి రాజస్థాన్ జట్టుకు చిరస్మరణ విజయాన్ని అందించాడు జోస్ బట్లర్. పనిలో పనిగా సెంచరీ కూడా చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. అక్కడితోనే బట్లర్ విజయప్రస్థానం ముగిసిపోలేదు. ఎన్నో రికార్డులను అతడు మడత పెట్టాడు… దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు. భీకరమైన ఫామ్ లో ఉన్న అతడు.. ఈ సీజన్లో మరిన్ని సెంచరీలు సాధించడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన అతడి బ్యాటింగ్ స్టైల్ ను కొనియాడుతున్నారు.

ఈ సీజన్లో ఇప్పటికే బట్లర్ సెంచరీ పూర్తి చేశాడు. మంగళవారం రాత్రి కోల్ కతా జట్టు పై ఊహించని విధంగా సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒంటి చేత్తో రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక్కడితోనే బట్లర్ సెంచరీ ప్రస్థానం ఆగిపోలేదు. మంగళవారం రాత్రి బట్లర్ చేసిన కోల్ కతా పై సెంచరీ ద్వారా ఇప్పటికే గేల్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ ఆటగాడిగా ఘనత లిఖించాడు. గేల్ ఐపీఎల్ లో ఆరు సెంచరీలు చేశాడు. మంగళవారం రాత్రి కోల్ కతా జట్టు పై చేసిన సెంచరీతో బట్లర్ గేల్ రికార్డు బ్రేక్ చేశాడు. బట్లర్ ఈ సీజన్లో రెండు సెంచరీలు సాధించాడు.

బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అతడు ఇప్పటివరకు ఎనిమిది శతకాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. బట్లర్ గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే విరాట్ కోహ్లీ రికార్డు కూడా బ్రేక్ అవుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కాగా, మంగళవారం కోల్ కతా విధించిన 224 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక దశలో 14 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి రాజస్థాన్ 128 పరుగులు చేసింది. చివరి ఆరు ఓవర్లకు రాజస్థాన్ జట్టు విజయం సాధించాలంటే 96 పరుగులు కావాలి. అప్పటికి బట్లర్ 42 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసి రాజస్థాన్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.