Himaja: కమిట్మెంట్ ఇచ్చినా ఆఫర్స్ ఇవ్వడం లేదు… క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి హిమజ షాకింగ్ కామెంట్స్!

హిమజకు హీరోయిన్ ఫ్రెండ్ లేదా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో హిమజ నటించింది.

Written By: S Reddy, Updated On : April 17, 2024 3:19 pm

Himaja

Follow us on

Himaja: నటి హిమజ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయిలు కమిట్మెంట్స్ ఇచ్చినా ఆఫర్స్ రావని ఆమె ఓపెన్ గా చెప్పింది. హిమజ సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. భార్యామణి ఆమె డెబ్యూ సీరియల్. అనంతరం స్వయం వరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. అలా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ పోతినేని హీరోగా నటించిన శివమ్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది.

హిమజకు హీరోయిన్ ఫ్రెండ్ లేదా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో హిమజ నటించింది. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో హిమజ పార్టిసిపేట్ చేసింది. హౌస్లో హిమజ పెద్దగా రాణించలేదు. 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు.

ఈ మధ్య హిమజకు సినిమా ఆఫర్స్ కూడా తగ్గాయి. ఆమె బుల్లితెర మీద కూడా కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో హిమజ పలు అంశాలపై స్పందించారు. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు ఎందుకు రావడం లేదు? కాస్టింగ్ కౌచ్ వంటి కీలక విషయాలపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపరు, అనే వాదన ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా…

తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉండరు అనేది ప్రూవ్ అయ్యింది. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లకు కూడా ఆఫర్స్ రావడం లేదు. అలా అని ఆఫర్స్ వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చారని కాదు. కన్నడ, మలయాళ లేదా ఇతర భాషల అమ్మాయిలకు ఆఫర్స్ ఇస్తూ తెలుగు వాళ్లకు ఇవ్వకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. కొన్ని పాత్రలకు కొందరే సెట్ అవుతారు. మరికొందరికి ఆఫర్స్ వచ్చినప్పటికీ, దురాశ కారణంగా కోల్పోతున్నారని… హిమజ చెప్పుకొచ్చారు.