https://oktelugu.com/

RR Vs GT: 19 ఓవర్ లో 20 పరుగులు.. రాజస్థాన్ కొంప ముంచింది అతడే..

197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ బౌండరీ సాధించి గుజరాత్ గెలుపును పరిపూర్ణం చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 11, 2024 9:35 am
    RR Vs GT

    RR Vs GT

    Follow us on

    RR Vs GT: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా బుధవారం రాత్రి ఉత్కంఠ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై గుజరాత్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ ఆటగాళ్లు సంచలన బ్యాటింగ్ చేయడంతో ఉత్కంఠ భరితమైన విజయాన్ని అందుకుంది. అయితే చివరి ఓవర్ లో కులదీప్ సేన్ 20 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఓవర్ లో గుజరాత్ ఆటగాళ్లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ చేతిలో నుంచి మ్యాచ్ చేజారిపోయింది. అప్పటిదాకా గెలుస్తామనే భరోసా ఉన్న ఆ జట్టులో.. ఒకసారి గా విజయావకాశాలను దెబ్బతీసింది.

    ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలవడంతో రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి196 రన్స్ చేసింది. రియన్ పరాగ్ 76, సంజు సాంసన్ 68* అద్భుతంగా ఆడటంతో 196 పరుగులు చేసింది.. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.

    197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ బౌండరీ సాధించి గుజరాత్ గెలుపును పరిపూర్ణం చేశాడు. గిల్ 72, సుదర్శన్ 35, రాహుల్ 20*, రషీద్ ఖాన్ 24* కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి.

    చేజింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు గిల్, సుదర్శన్ గట్టి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 64 పరుగులు చేశారు. కులదీప్ సేన్ బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు..వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన వేడ్(4), అభినవ్ మనోహర్ (1) కులదీప్ బౌలింగ్ లో ఔట్ అయ్యారు.. విజయ్ శంకర్ కూడా కులదీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. కీలక సమయంలో స్టంప్ అవుట్ అయ్యాడు. ఈ దశలో షారుక్ ఖాన్ (14) మెరుపులు మెరిపించినప్పటికీ.. వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ జట్టుకు 12 బంతుల్లో 35 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ దశలో 19 ఓవర్ వేసిన కులదీప్ సేన్ తన లయను మొత్తం కోల్పోయాడు. చావో, రేవో అన్నట్టుగా గుజరాత్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, రాహుల్ తేవాటియా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా ఆడి 20 పరుగులు చేశారు. ఫలితంగా మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.

    ఈ ఓవర్ లో తొలి బంతికి ఒక పరుగు వచ్చింది. మరుసటి బంతిని కులదీప్ వైడ్ వేశాడు. ఆ తర్వాత బంతిని రషీద్ ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. తీవ్ర ఒత్తిడిలో కులదీప్ నో బాల్ వేశాడు. మరసటి బంతికి రాహుల్ టుడీ(రెండు పరుగులు) తీశాడు. మూడో పరుగు తీయబోయి రన్ అవుట్ అయ్యాడు. రాహుల్ రన్ అవుట్ అయినప్పటికీ.. చివరి బంతిని రషీద్ ఖాన్ ఫోర్ కొట్టాడు.. దీంతో ఈ ఓవర్లో గుజరాత్ జట్టుకు 20 పరుగులు వచ్చాయి.

    ఇక చివరి ఓవర్ ను ఆవేశ్ ఖాన్ వేశాడు. తొలి నాలుగు బంతుల్లో 4, 2, 4, 1 రూపంలో 11 పరుగులు లభించాయి. చివరి రెండు బంతుల్లో రషీద్ ఖాన్ 2, 4 కొట్టడంతో గుజరాత్ ఉత్కంఠ విజయం దక్కించుకుంది. ఇలా 19 ఓవర్లో 20 పరుగులు ఇవ్వడంతో కులదీప్ పై గుజరాత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఒత్తిడిలో అలా వైడ్ బాల్స్ వేసి జట్టు కొంప ముంచామంటూ మండిపడుతున్నారు.