Homeఆంధ్రప్రదేశ్‌JanaSena: మెగా హీరోలు ప్రచారానికి రానట్టే.. స్టార్ క్యాంపైనర్లపై ఫుల్ క్లారిటీ

JanaSena: మెగా హీరోలు ప్రచారానికి రానట్టే.. స్టార్ క్యాంపైనర్లపై ఫుల్ క్లారిటీ

JanaSena: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమీపిస్తోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్నారు. అటు చంద్రబాబు తో పాటు పవన్ ఉమ్మడి వేదికలను పంచుకుంటున్నారు. ఎవరికివారుగా ప్రచారం చేస్తూనే.. మరోవైపు భారీ బహిరంగ సభల్లో ఇద్దరు నేతలు పాల్గొంటున్నారు. అటు షర్మిల సైతం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో ప్రచారం ఊపందుకుంది.మరోవైపు పవన్ సైతం దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎవరెవరు ప్రచారం చేస్తారు అన్నది క్లారిటీ లేదు. కానీ జనసేనకు మద్దతుగా బుల్లితెర స్టార్లు,ప్రముఖ కొరియోగ్రాఫర్లు, కమెడియన్లు రంగంలోకి దిగనున్నారు.ముఖ్యంగా జబర్దస్త్ టీం ఎన్నికల ప్రచారంలో పాల్గొనుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది.

జనసేన స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు,కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ (ఆర్కే నాయుడు), కమెడియన్ పృథ్వి, జబర్దస్త్ ఆర్టిస్టులు హైపర్ ఆది, గెటప్ శ్రీను లు ఈ స్టార్ క్యాంపెనర్ల జాబితాలో ఉన్నారు. ప్రజలే తన స్టార్ క్యాంపైనర్లు అని జగన్ ప్రచారం చేస్తుండగా.. పవన్ మాత్రం జబర్దస్త్ కమెడియన్లను నమ్ముకున్నారని వైసిపి ట్రోల్ చేయడం ప్రారంభించింది. గత ఎన్నికల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లను నమ్ముకుని పవన్ చేతికిల పడ్డారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. స్టార్ క్యాంపెనర్ లని చెప్పి.. జబర్దస్త్ కమెడియన్లను దించారేంటి? అని ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు.

చాలా రోజులుగా నాగబాబు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తో పాటు గెటప్ శ్రీను లు అదే షోతో పాపులర్ కమెడియన్లుగా పేరు తెచ్చుకున్నారు. జానీ మాస్టర్ తో పాటు కమెడియన్ పృథ్వీ కి కూడా జబర్దస్త్ తో మంచి అనుబంధమే ఉంది. అటు మొగలిరేకులు సీరియల్ ద్వారా సాగర్ అలరించారు. ఆయన పవన్ కళ్యాణ్ కు అభిమాని. అందుకే జనసేనలో చేరారు. ఇప్పుడు అదే పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అంబటి రాయుడు తోలుత వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కానీ చేరిన పది రోజులకే ఆ పార్టీని వీడారు. పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక భేటీ అయ్యారు. ఇప్పుడు జనసేన తరపున స్టార్ క్యాంపైనర్ గా మారారు. మొత్తానికైతే మెగా కాంపౌండ్ వాల్ నుంచి స్టార్లెవరు ఈసారి ప్రచారానికి రానట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version