MI Vs RR 2024: క్రికెట్ .. మనదేశంలో చాలామందికి ఇష్టమైన ఆట. క్రికెటర్లను ఆరాధ్య దేవుళ్ళుగా చూస్తుంటారు. వారు కనిపిస్తే చాలు ఆనందంతో గంతులు వేస్తారు. అయితే కొంతమంది క్రికెటర్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అటువంటి వారిలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. టీమ్ ఇండియా కెప్టెన్ గా ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఈ ఆటగాడికి సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. స్టార్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా అభిమానులుగా ఉన్నారు. రోహిత్ శర్మను మనదేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ కోట్లాదిమంది ప్రేక్షకులు అభిమానిస్తుంటారు. రోహిత్ శర్మ మైదానంలో కోపంగా కనిపించినప్పటికీ.. మైదానం వెలుపల అతడు చాలా సరదాగా ఉంటాడు. అందుకే అతనితో పని చేసిన క్రికెటర్లు, ఆడిన క్రికెటర్లు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. ప్రేమను ప్రదర్శిస్తారు. ఎందుకంటే రోహిత్ అటువంటి అనుబంధాన్ని చూపిస్తాడు కాబట్టి. పైగా ఒకరితో అటాచ్ మెంట్ పెంచుకుంటే రోహిత్ అస్సలే వదలడట. దానిని నిరూపించే ఓ సంఘటన ఇటీవల చోటుచేసుకుంది.
రోహిత్ శర్మ ను ముంబై కెప్టెన్ పదవి నుంచి తప్పించినప్పటికీ.. అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా అతనిని ఎందుకు తప్పించారని అభిమానులు సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు. ముంబై జట్టు యాజమాన్యాన్ని ఆ మధ్య ఏకిపడేశారు. చివరికి హార్దిక్ పాండ్యాను విమర్శించేందుకు కూడా వెనకాడ లేదు. ఒకానొక దశలో అభిమానుల వేధింపులు తట్టుకోలేక హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున ఐపీఎల్ ఆడుతూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా సోమవారం జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కు ముమ్మర కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రెండు జట్లు జైపూర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ బాండ్ వచ్చి రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయాడు. దీంతో రోహిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత షేన్ బాండ్ ను చూసి బిగ్గరగా నవ్వాడు. అతడిని దగ్గరికి తీసుకొని సరదాగా కబుర్లు చెప్పాడు. షేన్ బాండ్ ఐపీఎల్లో గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
కోల్ కతా జట్టు తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. ఆ సమయంలో రోహిత్ శర్మతో అతడికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే బాండ్ రోహిత్ శర్మకు ముద్దు పెట్టపోయాడు. ఆప్యాయంగా పలకరించేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు రోహిత్ శర్మ ఉలిక్కిపడి, తర్వాత తేరుకున్నాడు. ఫలితంగా షేన్ బాండ్ ముద్దు పెట్టలేకపోయాడు. అయితే రోహిత్ కు బాండ్ ముద్దు పెట్టబోతున్న వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. షేన్ బాండ్ మాత్రమే కాదు.. రోహిత్ శర్మ బాండింగ్ కు ఎవరైనా ముద్దు పెట్టాల్సిందేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఐపీఎల్ లో రాజస్థాన్ ఏడు మ్యాచ్లలో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టు ఏడు మ్యాచ్లో నాలుగు గెలిచి ఏడో స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంది.
Some are priceless #MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/s627hbYzuN
— Mumbai Indians (@mipaltan) April 21, 2024