Site icon OkTelugu

Rajinikanth and Nagarjuna: ఇది కదా కాంబినేషన్ అంటే… రజినీకాంత్ మూవీలో నాగార్జున, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Nagarjuna play a Key Role in Rajinikanth Film

Nagarjuna play a Key Role in Rajinikanth Film

Rajinikanth and Nagarjuna: 73 ఏళ్ల రజినీకాంత్ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ఆయన గత చిత్రం జైలర్ బ్లాక్ బస్టర్ కొట్టింది. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్ర దర్శకుడు. ప్రస్తుతం రజినీకాంత్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుందని సమాచారం. కాగా రజినీకాంత్ తన 171వ చిత్రం దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో కమిట్ అయిన విషయం తెలిసిందే.

లోకేష్ కనకరాజ్-రజినీకాంత్ కాంబోలో మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కెరీర్లో మొదటిసారి రజినీకాంత్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా తలైవర్ 171వ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో నాగార్జున కీలక రోల్ చేస్తున్నారు. ఈ వార్త టాలీవుడ్ ని షేక్ చేస్తుంది.

ఇటీవల లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ వచ్చాడు. హీరో నాగార్జునను కలిశాడు. రజినీకాంత్ మూవీలో రోల్ కోసమే నాగార్జునను లోకేష్ కనకరాజ్ కలిశారట. నాగార్జున సైతం పచ్చ జెండా ఊపాడట. నాగార్జున-రజినీకాంత్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయం అంటున్నారు. గతంలో ఎన్నడూ వీరిద్దరూ కలిసి ఒక చిత్రం చేసింది లేదు. రజినీకాంత్-చిరంజీవి మాత్రమే ఒకే చిత్రంలో నటించారు. కొన్నాళ్లుగా నాగార్జున స్టార్డం తగ్గింది. ఆయన ఇతర హీరోల చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.

రన్బీర్ కపూర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున నటించిన విషయం తెలిసిందే. కొన్ని నిమిషాలు ఆయన పాత్ర ఉంటుంది. సోలో హీరోగా వర్క్ అవుట్ కావడం లేదు. అందుకే నా సామిరంగ మల్టీస్టారర్ గా చేసి సక్సెస్ అయ్యాడు. నా సామిరంగ మూవీలో అల్లరి నరేష్, తరుణ్ భాస్కర్ సైతం నటించారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన నా సామిరంగ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున తన 100వ చిత్రానికి సిద్ధం అవుతున్నాడట. ఇక తలైవర్ 171వ చిత్రంలో రజినీకాంత్ కూతురుగా శృతి హాసన్ నటిస్తుందని మరో వార్త హల్చల్ చేస్తుంది.

Exit mobile version