https://oktelugu.com/

నేడు బెంగుళూరు వర్సెస్ పంజాబ్..: ఎవరెలా ఉన్నారంటే..?

అంచనాలకు మించి రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఈరోజు పంజాబ్ పోటీ పడనుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో బెంగుళూరు హవా సాగిస్తోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటిని గెలుచుకుంది. అటు పంజాబ్ మాత్రం కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఇంతకుముందు కోల్ కతా చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు కాస్త ఒత్తిడిలో పడింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లల్లో ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2021 / 01:35 PM IST
    Follow us on

    అంచనాలకు మించి రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఈరోజు పంజాబ్ పోటీ పడనుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో బెంగుళూరు హవా సాగిస్తోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటిని గెలుచుకుంది. అటు పంజాబ్ మాత్రం కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఇంతకుముందు కోల్ కతా చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు కాస్త ఒత్తిడిలో పడింది.

    ఇప్పటి వరకు ఐపీఎల్ లల్లో ఈ రెండు జట్లు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. వీటిలో 14 సార్లు పంజాబ్ కింగ్ గెలుపొందగా మిగిలిన 12 సార్లు రాయల్ ఛాలెంజ్ సొంతం చేసుకుంది. అయితే రెండు జట్లు స్కోర్ల విషయంలో సమానంగానే ఉన్నాయి. బెంగుళూరుపై పంజాబ్ అత్యధికంగా 232 పరుగులు చేయగాచ, పంజాబ్ పై బెంగళూరు 226 స్కోరుతో నమోదైంది. శుక్రవారం జరిగే మ్యాచ్లో ఎవరెంత స్కోరు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

    తాజాగా జరగబోయే మ్యాచ్ లో బెంగుళూరు జట్టులో ఓపెనర్లుగా దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి ఊపుమీదున్నారు. గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. వీరంతా కలిసి టీంను ఓ క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. వీరికి తోడుగా రజత్ పాటిదార్ చేరికతో జట్టుకు బలం చేకూరినట్లయింది. ఆల్ రౌండర్ వాషింగ్డన్ సుందర్ రెండు విభాగాల్లో రాణించకపోవడం గమనార్హం.

    పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడేస్తున్నారు. మిగతా సభ్యల్లో క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ సంగతి సరేసరి. అయితే కేఎల్ రాహుల్ ఆరంభంలో ఔటైతే మాత్రం జట్టు ఒత్తిడిలో పడే అవకాశం ఉంది. ఆల్రౌండర్ హెన్రిక్యూస్ వరుస మ్యాచుల్లో విపలమవుతూ టీంకు భారమవుతున్నాడు.