https://oktelugu.com/

దారుణం: కేవీ ఆనంద్ మృతదేహాన్ని ఇవ్వని ఆస్పత్రి

ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) చనిపోయింది హార్ట్ ఎటాక్‌తోనే అనుకున్నారు అందరూ. అయితే ఆయన మృత‌దేహాన్ని ఇవ్వ‌డానికి ఆసుప‌త్రి వ‌ర్గాలు నిరాక‌రించడంతో ఆనంద్ మరణం పై ఇప్పుడు అనుమానాలు మొదలైయ్యాయి. హాస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం కోవిడ్ నిబంధ‌న‌ల దృష్ట్యా మృత‌దేహాన్ని ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. ఆఖ‌రికి స్టార్ హీరో సూర్య కూడా రంగంలోకి దిగి, ఆసుప‌త్రి వ‌ర్గాల‌తో మంత‌నాలు జ‌రిపినప్పటికి ఫలితం లేకుండా పోయింది. వాళ్ళు ఆనంద్ మృతదేహాన్ని ఇవ్వలేదని సమాచారం. కాగా గత […]

Written By:
  • admin
  • , Updated On : April 30, 2021 / 01:56 PM IST
    Follow us on

    ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) చనిపోయింది హార్ట్ ఎటాక్‌తోనే అనుకున్నారు అందరూ. అయితే ఆయన మృత‌దేహాన్ని ఇవ్వ‌డానికి ఆసుప‌త్రి వ‌ర్గాలు నిరాక‌రించడంతో ఆనంద్ మరణం పై ఇప్పుడు అనుమానాలు మొదలైయ్యాయి. హాస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం కోవిడ్ నిబంధ‌న‌ల దృష్ట్యా మృత‌దేహాన్ని ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. ఆఖ‌రికి స్టార్ హీరో సూర్య కూడా రంగంలోకి దిగి, ఆసుప‌త్రి వ‌ర్గాల‌తో మంత‌నాలు జ‌రిపినప్పటికి ఫలితం లేకుండా పోయింది. వాళ్ళు ఆనంద్ మృతదేహాన్ని ఇవ్వలేదని సమాచారం.

    కాగా గత వారం ఆనంద్ ఫ్యామిలీ కరోనాకి గురి అయింది. దీన్నిబట్టి ఆనంద్ కరోనాతో మరణించి ఉండొచ్చు. ఏది ఏమైనా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆనంద్ మృతి తీరని లోటు. ఆనంద్ దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. పైగా ఒక చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ‘తెన్నావిన్‌ కోంబత్‌’ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌ గా ప్రమోట్ అయి.. సౌత్ ఇండస్ట్రీలన్నిటితో పాటు బాలీవుడ్‌ లో కూడా పలు సినిమాలకు పని చేసి.. సక్సెస్ ఫుల్ సినిమాటోగ్రాఫర్‌ అనిపించుకున్నారు.

    పైగా కె.వి ఆనంద్ కెమెరామెన్‌ గా ‘తెన్నావిన్‌ కోంబత్’ అనే చిత్రానికిగానూ ఏకంగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. ఇటు ఆనంద్ సినిమా దర్శకుడిగానూ సూపర్ సక్సెస్ అయ్యారు. జీవాతో తెర‌కెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ స్టేటస్ సాధించారు. ఇప్పటికీ ఆ సినిమా ఆ జోనర్ లో వచ్చిన సినిమాలలో క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఆ తరువాత కూడా తన శైలి విభిన్నమైనది అని తెలియజేస్తూ.. ఆయన నుండి బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) లాంటి విభిన్న సినిమాలు వచ్చాయి.కాగా కె.వి.ఆనంద్ మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఆనంద్ మరణ వార్తతో తమిళ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.