https://oktelugu.com/

Ellyse Perry : అటు అందం.. ఇటు ఆట.. ఎల్లిస్ ఫెర్రీ గురించి ఆసక్తికర విశేషాలు..

ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో ఫెర్రీ అదరగొడుతోంది. తన అద్భుతమైన ఆటతీరుతో బెంగళూరు జట్టును ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్ళింది. దీంతో కన్నడ ప్రేక్షకులు ఈమెను తమ జట్టు పాలిట అదృష్ట దేవతగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫెర్రీ ఆరు వికెట్లు తీసి ఆరుదైన ఘనత సాధించింది. బ్యాడ్ తోనూ మెరుపులు మెరిపించింది.

Written By: , Updated On : March 17, 2024 / 10:27 AM IST
Ellyse Perry

Ellyse Perry

Follow us on

Ellyse Perry : ఎల్లిస్ ఫెర్రీ.. ఇండియన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మార్మోగుతున్న పేరు. ఈ ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి ఇండియన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు ఆడుతోంది. ఈమెను ఆ జట్టు ప్రాంచైజీ 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఫెర్రీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఉత్తరప్రదేశ్ బౌలర్ దీప్తి శర్మ వేసిన బంతిని బలంగా కొట్టడంతో.. ఏకంగా అది టాటా పంచ్ కారు ముందు అద్దాలను పగలగొట్టింది. ఆమె దూకుడైన బ్యాటింగ్ ఎలా ఉంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఫెర్రీ బ్యాటింగ్ వల్ల బెంగళూరు జట్టు ముంబైని ఓడించి ఫైనల్ దూసుకెళ్లింది. ఆదివారం బెంగళూరు జట్టు ఢిల్లీ జట్టుతో కప్ కోసం పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టులో కీలకమైన క్రీడాకారిణిగా పేరుపొందిన ఎల్లీస్ ఫెర్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు..

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో ఎల్లీస్ ఫెర్రీ కీలకమైన ప్లేయర్ గా ఉంది. ఆటతోపాటు పోత పోసిన అందగత్తెగా ఎల్లీస్ ఫెర్రీకి పేరు ఉంది. అందువల్లే ఆమె ఆడుతోంది అని తెలిస్తే చాలు అభిమానులు మైదానానికి పోటెత్తుతారు. 2007 నుంచి ఫెర్రీ క్రికెట్ ఆడుతోంది.. ఆస్ట్రేలియా మహిళల జాతీయ జట్టు మాత్రమే కాకుండా వివిధ టీ-20 లీగ్ మ్యాచ్ లలో కూడా సత్తా చాటుతోంది. బిగ్ బాష్ లీగ్ లలో కూడా అదరగొడుతోంది.

ఎల్లీస్ ఫెర్రీ అసలు పేరు ఎల్లీస్ అలెగ్జాండర్ ఫెర్రీ. 1990లో ఆస్ట్రేలియాలో జన్మించింది. క్రికెట్, సాకర్ లో సత్తా చాటింది. 16 సంవత్సరాల వయసులోనే ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుతో పాటు జాతీయ సాకర్ జట్టులోనూ ఎంట్రీ ఇచ్చింది. 2014 నుంచి సాకర్ ను పక్కనపెట్టి కేవలం క్రికెట్ పైన ఫోకస్ పెట్టింది..

2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ లో బెంగళూరు జట్టు ఫెర్రీ ని 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఫెర్రీ గంటకు 110 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుంది. బ్యాటింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్ట్రైట్ స్ట్రోక్స్, అప్పర్ కట్, కవర్ డ్రైవ్ లు ఆడేందుకు ఇష్టపడుతుంది.. 2013 అక్టోబర్ 24న ఆస్ట్రేలియన్ రక్బీ ప్లేయర్ మాట్ టోమువా తో కలిసి వేడుకలో పాల్గొన్నది. అతనితో తనకున్న బంధాన్ని బహిర్గతం చేసింది. 2014 ఆగస్టు 20న ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. 2015 డిసెంబర్ 20న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.. క్రికెట్, రగ్బీ మ్యాచ్ లు లేకుంటే ఈ జంట కాఫీ షాపులు నిర్వహించేవారు. వ్యక్తిగత కారణాల వల్ల 2020లో వీరు విడిపోయారు.

ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో ఫెర్రీ అదరగొడుతోంది. తన అద్భుతమైన ఆటతీరుతో బెంగళూరు జట్టును ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్ళింది. దీంతో కన్నడ ప్రేక్షకులు ఈమెను తమ జట్టు పాలిట అదృష్ట దేవతగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫెర్రీ ఆరు వికెట్లు తీసి ఆరుదైన ఘనత సాధించింది. బ్యాడ్ తోనూ మెరుపులు మెరిపించింది. 38 బంతుల్లో 40 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఫెర్రీ పై బెంగళూరు జట్టు భారీ ఆశలే పెట్టుకుంది.