Kir Clavis: దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా.. భారత కార్ల మార్కెట్లలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీని నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి అలరించాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటేస్ట్ కార్లను తీసుకొస్తూ ఆకర్షిస్తోంది. తాజాగా ఓ కొత్త కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది వివిధ వేరియంట్లను కలిగి ఉంది. దీంతో వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా మోడల్ ను ఎంచుకోవచ్చు. మరి ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..
కియా నుంచి కొత్తగా వచ్చే కారు క్లావిస్. ఇది కాంపాక్ట్ ఎస్ యూవీ వేరియంట్ లో అందుబాటులోకి రానుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ నాలుగు సిలిండర్లతో ఇంజిన్ ను కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉండడంతో ఫ్రంట్ వీల్ తో కనెక్ట్ అయి ఉంది. ఎండ వేడి నుంచి రక్షణ పొందేందుకు ఎలక్ట్రిక్ సన్ రూప్, బిగ్ టచ్ స్క్రీన్ ఆకర్షిస్తుంది. అయితే ఇది ఇంకా సేఫ్టీ విషయంలో ఎలాంటి రేటింగ్ పొందలేదు. కానీ ఇందులో రక్షణ విషయంలో మాత్రం కేర్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
కొత్త కియా కారు డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది మొత్తం 6 రకాల మోడళ్లు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా మోడల్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా కాంపాక్ట్ ఎస్ యూవీని పోలి ఉంటుంది. ఇందులో స్పిల్ట్ ఎల్ ఈడీ లైట్ ల్యాంప్స్ తో పాటు టైగర్ నోస్ గ్రిల్లే నుఅమర్చారు. డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ .. బ్లాక్డ్ రూప్ రైల్స్ ఉండడం వినియోగదారులను ఆకర్షిస్తుంది.
వచ్చే డిసెంబర్ లోగా ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర విషయం తెలియజేయనప్పటికీ రూ.6.00 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. కియా నుంచి గతంలో రిలీజ్ అయినా సోనేట్ సైతం ఫేస్ లిప్ట్ తో రాబోతుంది. ఇదే సమయంలో క్లావిస్ మరింత ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే ఈ కొత్త మోడల్ వినియోగదారులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.