క్రీడలుRoss Taylor Rahul dravid : పులుల కంటే ద్రావిడ్ గొప్ప.. రాస్ టేలర్ కామెంట్స్...

Ross Taylor Rahul dravid : పులుల కంటే ద్రావిడ్ గొప్ప.. రాస్ టేలర్ కామెంట్స్ వైరల్

Ross Taylor Rahul dravid : భారత్ లో క్రికెట్ అంటే ఒక మతం.. ఆ మతాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. విదేశీ క్రికెటర్లు అయితే భారత్ లో ఇంత పిచ్చిగా ప్రేమించే క్రికెట్ అభిమానులను ఎప్పుడూ చూసి ఉండమని చెబుతుంటారు. న్యూజిలాండ్ ప్రముఖ లెజండరీ క్రికెటర్ రాస్ టేలర్ సైతం భారత్ లోని క్రికెట్ పిచ్చిని చూసి అందరూ షాక్ అయ్యారు.

తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’ ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్ శనివారం ఐపీఎల్ సందర్భంగా డకౌట్ అయినందుకు రాయల్స్ రాజస్థాన్ ఓనర్ తన చెంప పగుల కొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు.

ఇక తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్.. ప్రస్తుత హెడ్ కోచ్ ద్రవిడ్ తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాస్ టేలర్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్ వార్న్ సహా రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్ పంచుకున్న టేలర్ అప్పుడు బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నారు.

2011 ఐపీఎల్ సందర్భంగా ఒకసారి ద్రావిడ్ తో కలిసి రాజస్థాన్ లోని రణతంబోర్ జాతీయ పార్క్ ను సందర్శించాడు. 21 సార్లు వెళ్లినా కనిపించని పులి.. 22వ సారి ద్రావిడ్ కు కనిపించడంతో రాహుల్ ద్రావిడ్ ఆనందం వ్యక్తం చేశారని.. అయితే పులిని చూడడానికి వచ్చిన జనాలు అది వదిలేసి.. ద్రావిడ్ ను చూశారని టేలర్ చెప్పుకొచ్చాడు. పులిని చూసిన ఆనందం కంటే వారు రాహుల్ ద్రావిడ్ ను చూసిన ఆనందమే ఎక్కువగా అనిపించిందన్నారు. తనకు తెలిసినంత వరకూ ప్రపంచంలో 4వేల పులులు ఉంటాయేమో కానీ.. రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక్కడేనని.. అందుకే ఆయన పట్ల ఇంత క్రేజ్ అని రాస్ టేలర్ అన్నారు.

ఇలా ద్రావిడ్ గొప్పతనం.. ఇండియాలో క్రికెట్ పై ఉన్న ప్రేమను తన పుస్తకంలో టేలర్ గొప్పగా వర్ణించాడు. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Rohit Sharma: టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు షాక్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, అభిమానులు ముద్దుగా హిట్‌ మ్యాన్‌ అని పిలచుకునే రోహిత్‌ శర్మ తాజాగా తన ప్రసంగంలో కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు షాక్‌ ఇచ్చారు. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ...

Rajasthan Royals CEO Jake Lush McCrum: నిన్న ద్రావిడ్.. నేడు ఇతడు.. రాజస్థాన్ జట్టులో ఏం జరుగుతోంది? ఇంతకీ ఐపీఎల్ ఆడుతుందా?

Rajasthan Royals CEO Jake Lush McCrum: ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో వార్న్ ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. అయినప్పటికీ ఆ జట్టు...

Most Popular

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...
Exit mobile version