Rohith Sharma : ప్రస్తుతం ఐపీఎల్ 18వ ఎడిషన్ కొనసాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. విజయం కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. కొన్ని జట్లు బౌలింగ్ తో.. మరికొన్ని జట్లు బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాయి. పరుగుల వరద మాత్రమే.. వికెట్లు కూడా పడుతున్నాయి. అందువల్లే ఈ సీజన్ అభిమానులకు సరికొత్త క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. ఇక క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు వచ్చే అభిమానులకు క్రికెటర్లు సరికొత్త సర్ప్రైజ్లు ఇస్తున్నారు. అంతేకాదు వారితో ఫోటోలు దిగుతూ.. ఆటోగ్రాఫ్ లు ఇస్తూ వారి మోములో సంతోషాన్ని నింపుతున్నారు. అయితే అభిమానులను ఖుషి చేయడంలో ఒక్కో ఆటగాడిది ఒక్కో స్టైల్. ఇందులో రోహిత్ శర్మది డిఫరెంట్ స్టైల్.
Also Read : జైపూర్ స్టేడియంలో కింగ్ కోహ్లీ.. సింహం లాంటి రాజసం భయ్యా
అమ్మాయి ముఖంలో ఆనందం కోసం
రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ సీజన్లో ఇంతవరకు చెప్పుకోదగిన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేదు. అంతేకాదు ఒక మ్యాచ్ కు గాయం వల్ల దూరమయ్యాడు. అయినప్పటికీ రోహిత్ తన ఆట తీరులో పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చూపించడం లేదు. ఇది అంతిమంగా ముంబై జట్టుకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీ తో ఆదివారం జరిగే మ్యాచ్ నేపథ్యంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముంబై జట్టు ఢిల్లీ వెళ్ళింది. అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ ప్రాక్టీస్ నేపథ్యంలో రోహిత్ శర్మను కలవడానికి కొంతమంది అభిమానులు వచ్చారు. వారిలో ఒక యువతి కూడా ఉంది. రోహిత్ శర్మను అభిమానులు చుట్టుముట్టడంతో.. అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంత లోనే అయువతి ఆటోగ్రాఫ్ కోసం రోహిత్ వద్దకు రావడంతో.. అంత రద్దీలో కూడా అతడు కాదనలేకపోయాడు. ఆమె ముఖంలో సంతోషం చూసేందుకు.. ప్రయత్నించాడు. వెంటనే ఆటోగ్రాఫ్ ఇచ్చి.. ఆ అమ్మాయిని ఖుషి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు..” రోహిత్ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. అతడు ఉన్నచోట ఆనందం తాండవిస్తుంది. ఎవరి ముఖంలో కూడా దుఃఖాన్ని చూసేందుకు రోహిత్ ఇష్టపడడంటూ” ముంబై అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఢిల్లీ జట్టు ఇటీవల బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో మెమొరబుల్ విక్టరీ సాధించింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకా కొన్ని మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోయినట్టే. ఇక ముంబై జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆ జట్టు తదుపరి ప్రయాణం మెరుగ్గా ఉండాలి అంటే.. ఈ మ్యాచ్ లో కంపల్సరీ గెలవాలి. మరోవైపు ఢిల్లీకి సొంత ప్రేక్షకుల బలం ఉంది. మరి ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు ఏం చేస్తారో చూడాలి.
ROHIT SHARMA, AN EMOTION ❤️
– Ro, makes everyone smile with his down to earth Character. pic.twitter.com/N8qwZc2gAo
— Johns. (@CricCrazyJohns) April 13, 2025