SS Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు చూడాలంటే సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిందే. అయితే ఆయన తీసే ప్రతి సినిమా ఒక సంచలనంగా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా బిజీలో ఉన్నా అయిన ఇటీవల జపాన్లో పర్యటించారు. అయితే రాజమౌళి తీసిన ఆర్ఆర్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. రాజమౌళి చివరి సినిమా ఆర్ఆర్ ఆర్ ఆస్కార్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కలిపి డాక్యుమెంటరీని రిలీజ్ చేయనున్నారు. ఇది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి..
Also Read : రోహిత్ ఎక్కడ ఉంటే.. అక్కడ చిరునవ్వుంటుంది.. వైరల్ వీడియో
రాజమౌళి జపాన్లో పర్యటించిన సందర్భంగా కొందరు మీడియాకు చెందినవారు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక ప్రేక్షకుడిగా మీకు ఎలాంటి చిత్రాలు ఆసక్తిని రేపు తాయి అని కొందరు అడగ్గా.. తనకు ఎన్టీఆర్ నటించే డ్రాగన్, ప్రభాస్ నటించిన స్పిరిట్, రామ్ చరణ్ నటించిన మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలు రెగ్యులర్ షూటింగ్ను జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే రాజమౌళి మాత్రం తన డాక్యుమెంటరీ కోసం జపాన్ కు వచ్చిన సందర్భంగా తనకు నచ్చిన సినిమాల గురించి చెప్పడం ఆసక్తిగా మారింది. మరోవైపు ఆర్ఆర్ఎస్ సినిమా తీయడానికి మూడేళ్ల సమయం పట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో మొత్తం 20tb ఫుటేజ్ కాగా వాటిలో ముఖ్యమైన వీడియోలను కలిపి డాక్యుమెంటరీ తయారు చేశారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మహేష్ బాబు లుక్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. అయితే గతంలో రాజమౌళి సినిమాలకు సంబంధించి కొన్ని విషయాలను అప్డేట్ చేసేవారు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు సంబంధించి హీరో పోస్టర్ తప్ప మరి ఏమి రిలీజ్ చేయడం లేదు. దీంతో షూటింగ్ ఎంత స్థాయిలో ఉందనే విషయం పగడ్బందీగా రహస్యంగా ఉంచుతున్నారు.
కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్ లా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మహేష్ లుక్స్ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది.. అయితే కనీసం కథ కాన్సెప్టు గురించి ఏమాత్రం బయటకు రాకుండా పకడ్బందీగా ఉండటంతో సినిమాపై మరింత హోప్స్ పెరుగుతుంది. కొన్నాళ్లు రామాయణ కథనం ఆధారంగా సినిమా తీస్తున్నారని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత సినిమా స్టోరీ మారిపోయినట్టు తెలుస్తోంది.
Also Read : అక్షరాలా 500 కోట్ల ప్రాజెక్ట్ లోకి సమంత..హాలీవుడ్ హీరోయిన్ అవుట్!