Rohith Sharma : గత ఐపీఎల్లో రోహిత్ అదరగొట్టాడు.14 మ్యాచ్లలో 417 పరుగులు చేశాడు. అయితే ఆ సీజన్లో ముంబై జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. గత సీజన్లో ముంబై జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. రోహిత్ ఆధ్వర్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది. కానీ గత సీజన్లో మాత్రం అతడిని ఒక ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసింది. కెప్టెన్ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. ఇక హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలో గత సీజన్లో ముంబై జట్టు ఊహించిన స్థాయిలో ప్రతిభ చూపించలేకపోయింది. ఇక రోహిత్ శర్మ గత సీజన్లో చెలరేగి ఆడినప్పటికీ.. జట్టులో మిగతా ఆటగాళ్లు అంతగా ప్రతిభ చూపించలేకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. మైదానం వెలుపల సున్నితంగా.. మైదానం లోపల అగ్రెసివ్ వ్యక్తిత్వంతో రోహిత్ శర్మ ఉంటాడు. కానీ టాలెంట్ ను ప్రోత్సహించడంలో అతడికి అతడే సాటి. అందువల్లే అతడిని చాలామంది అభిమానిస్తుంటారు.
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత..
గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. నాడు టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ వెస్టిండీస్ లోని మైదానాన్ని పదేపదే తన పిడికిలితో గుద్దాడు. అంతేకాదు జాతీయ జెండాను మైదానంలో ఏర్పాటు చేసి సెల్యూట్ చేశాడు. మైదానంలో అలా పడుకుండిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే రోహిత్ శర్మ అలా చేయడం అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక రోహిత్ ఆధ్వర్యంలో ఇటీవల టీమిండియా దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా అన్ని మ్యాచ్లలోనూ విజయం సాధించింది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీని విజయం సాధించడంతో .. రోహిత్ చరిష్మా మరింత పెరిగింది.
ఇన్ స్టా లో ఎమోషన్..
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో రోహిత్ కు అభిమాన గణం మరింత పెరిగింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఐపిఎల్ లో రోహిత్ శర్మ ఆడుతున్న నేపథ్యంలో.. ప్రత్యర్థి ప్లేయర్లు కూడా అతనితో ఫోటో దిగడానికి.. మాట్లాడటానికి ఇష్టం చూపిస్తున్నారు. అందులో రాయల ఛాలెంజ్ బెంగళూరు జట్టు ఆటగాడు కూడా ఉన్నాడు. రోహిత్ శర్మని కలిసి తన ఆనందాన్ని ఇన్ స్టా లో పంచుకున్నాడు. రోహిత్ ను కలిసిన వారిలో అభిమన్యు సింగ్ ఉన్నాడు. ఇతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు. అతను ఇటీవల రోహిత్ శర్మను కలిశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించాడు. అనంతరం బ్యాటింగ్ కు సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ను అభిమన్యు సింగ్ రోహిత్ నుంచి నేర్చుకున్నాడు. రోహిత్ శర్మను కలిసిన తర్వాత దిగిన ఫోటోను అభిమన్యుసింగ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ” వారు అన్నారు మీ అభిమాన వ్యక్తులను కలవలేరు అని. కానీ దీనిని రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. నాకున్న వ్యతిరేక ఆలోచనలను దూరం చేసాడని” అతడు పేర్కొన్నాడు. అభిమన్యు సింగ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రోహిత్ ను కలిసి దిగిన ఫోటోను అభిమన్యు సింగ్ ఇన్ స్టా లో పోస్ట్ చేయగా.. అది లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.