CSK : ధోని ఈ సీజన్ ముగిసేంతవరకు కెప్టెన్ అవుతాడని చెన్నై జట్టు యాజమాన్యం ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పై వ్యాఖ్యలు చేస్తున్నారు. ధోని అభిమానులు కాబట్టి అలా వ్యాఖ్యానించడంలో తప్పులేదు. దానిని తప్పుపట్టే అవకాశం కూడా లేదు. కానీ ఇక్కడే వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ధోని ఆధ్వర్యంలో చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టుతో సమానంగా కొనసాగుతోంది. కానీ చెన్నై జట్టులో రుతు రాజ్ గైక్వాడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. అతనికంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2021, 2023, 2024 సీజన్లలో రుతు రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కరకంగా చెప్పాలంటే ఐపిఎల్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Also Read : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోని.. అసలేమైందంటే
మూడు సీజన్లలో..
చెన్నై జట్టులో ఎంతో గొప్ప బ్యాటర్లు ఉన్నప్పటికీ రుతు రాజ్ గైక్వాడ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2021 లో జరిగిన ఐపిఎల్ లో ఏకంగా 635 పరుగులు చేశాడు. ఒకరకంగా ఆ సీజన్లో చెన్నై జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతడు నిలిచాడు. 2023లో జరిగిన ఐపీఎల్లో 590 పరుగులు చేశాడు. ఆ సీజన్లో చెన్నై జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రుతు రాజ్ గైక్వాడ్ నిలిచాడు. 2024లో జరిగిన ఐపీఎల్ సీజన్లో రుతు రాజ్ గైక్వాడ్ 583 పరుగులు చేసి.. చెన్నై జట్టు తరఫున ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇలా తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ పవర్ తో.. తనకు మాత్రమే వీలైన టెక్నిక్ తో రుతు రాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. రుతు రాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుంది కాబట్టే చెన్నై జట్టు యాజమాన్యం 2024 సీజన్లో అతడిని కెప్టెన్ గా నియమించింది.. కానీ ఇప్పుడు అనుకోకుండా గాయం కావడంతో.. అతడు సీజన్ మొత్తానికే దూరం కావలసి వచ్చింది. ఇక చెన్నై జుట్టులో ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప బ్యాటర్లు ఉన్నప్పటికీ.. వారు ఆశించిన స్థాయిలో ఆడ లేకపోతున్నారు. ఇక బౌలింగ్ విషయంలోను చెన్నై జట్టు గొప్పగా ప్రదర్శన చేయలేకపోతున్నది. అందువల్లే వరుస ఓటములు ఎదుర్కొంటున్నది. దీనివల్ల చెన్నై జట్టు ప్రస్తుత సీజన్లో పాయింట్లు పరంగా తొమ్మిదో స్థానంలో ఉంది. అది చెన్నై జట్టు అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. అందువల్లే ధోని నాయకత్వాన్ని ఇటీవల చెన్నై అభిమానులు కోరుకున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. చివరికి వారు కోరుకున్నట్టుగానే చెన్నై జట్టుకు ఇప్పుడు ధోని నాయకత్వం వహిస్తున్నాడు.