MS Dhoni : ఇక ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఊహించినంత స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ గా ఆవిర్భవించింది. అయితే అటువంటి జట్టు ఈ స్థాయిలో ఆడుతుందని అభిమానులే కాదు.. మాములు ప్రేక్షకులు కూడా ఊహించి ఉండరు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత వరుసగా ఓటములు ఎదుర్కొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని 12 బాల్స్ లో27 రన్స్ కొట్టేశాడు. ఇందులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోను ధోని 26 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 43 సంవత్సరాల వయసులోనూ ధోని అద్భుతంగా ఆడుతున్నాడు. చివర్లో వచ్చి జట్టుకు అవసరమైన పరుగులు చేస్తున్నాడు.
Also Read : GT తో ఓటమి.. పైగా 24 లక్షలు బొక్క.. ఇదేం దరిద్రం రా అయ్యా
రుతు రాజ్ గైక్వాడ్ కు విశ్రాంతి
ప్రస్తుతం చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రుతు రాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. దీంతో అతడు తదుపరి జరిగే మ్యాచ్ లకు ఫిట్ గా లేడని తెలుస్తోంది. దీంతో అతడిని తదుపరి మ్యాచ్లకు చెన్నై జట్టు యాజమాన్యం దూరంగా ఉంచింది. ఒక రకంగా సీజన్ ముగిసే వరకు చెన్నై జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహిస్తాడని చెన్నై జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది..” రుతు రాజ్ గైక్వాడ్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. అతడు కోలుకోవడం కష్టంగా మారింది. అతడు నెట్స్ లో సాధన చేస్తున్నప్పుడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోయాడు. దీంతో అతడిని ఈ సీజన్ ముగిసేంతవరకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అతని స్థానంలో చెన్నై జట్టుకు ధోని తాత్కాలిక కెప్టెన్ గా ఉంటాడని” చెన్నై జట్టు యాజమాన్యం ప్రకటించింది. ధోనీని కెప్టెన్ గా నియమిస్తారని ఇటీవలే చెన్నై అభిమానులు భావించారు. ఎందుకంటే పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ ముందు రుతు రాజ్ గైక్వాడ్ ను తప్పిస్తాడని వార్తలు వచ్చాయి. దీనిని చెన్నై జట్టు యాజమాన్యం తోసి పుచ్చింది. చివరికి ఇప్పుడు ధోని కెప్టెన్ కావడంతో అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సోషల్ మీడియాలో ధోనిని కీర్తిస్తూ అతని అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.
Also Read : గుజరాత్ విజయ ప్రస్థానం వెనుక ఇద్దరు తమిళ ‘‘సాయి’’లు!