Rohith Sharma: ఇతర దేశాల ఆటగాళ్లు సైతం ఐపీఎల్ లో ఆడేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తారంటే.. ఇక్కడ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అభిమానులు సొంత మనుషుల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అమితమైన ప్రేమను కనబరుస్తుంటారు. తోటి ఆటగాళ్లు కూడా స్వచ్ఛమైన స్నేహాన్ని అందిస్తుంటారు. అందువల్లే ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ(Rohit Sharma) ముందు ఉంటాడు. మైదానంలో దూకుడుగా ఉన్నప్పటికీ.. మైదానం వెలుపల మాత్రం ఎంతో స్నేహంగా ఉంటాడు. తన ఆప్యాయతను ప్రదర్శిస్తుంటాడు. తన వికెట్ తీసిన బౌలర్లను అభినందిస్తుంటాడు. మైదానంలో మెరుగ్గా ప్రదర్శన చేసిన ఆటగాలను భుజం తట్టి ప్రోత్సహిస్తుంటాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అయినప్పటికీ ఏమాత్రం బేషజం చూపించడు. పైగా వారికి తన వంతుకు మించి సహకారాన్ని అందిస్తుంటాడు. కాకపోతే ఈ విషయాలను రోహిత్ బయటకు చెప్పుకోడు. బయటికి రానివ్వడు. అదే రోహిత్ గొప్పతనం. ఇక సోమవారం బెంగళూరు జట్టుతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో రోహిత్ 17 పరుగులు చేసే అవుట్ అయ్యాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. యష్ దయాళ్(Yash Dayal) వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై జట్టు ఒక్కసారిగా దిగ్బ్రాంతి గురైంది.
Also Read: వన్ డౌన్ లో వచ్చి.. సెంచరీలు కొట్టిన తిలక్ ను 4వ స్థానంలోనా?
అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు
సహజంగా ఎవరైనా బౌలర్ తమ వికెట్ తీస్తే బ్యాటర్ కు ఎక్కడ ఒకచోట కోపం ఉంటుంది. దానిని మనసులో పెట్టుకొని సదరు బౌలర్ తో అంతగా మాట్లాడారు . మాట్లాడే అవకాశం వచ్చినప్పటికీ ఏదో ఒకటి కల్పించుకొని దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ సోమవారం తన వికెట్ తీసిన యష్ దయాళ్ ను మాత్రం రోహిత్ అభినందించాడు. తన గుండెలకు హత్తుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసావ్ అంటూ ప్రశంసించాడు. బౌలింగ్ ఇలానే కొనసాగించాలంటూ అతడికి సూచించాడు. అంతేకాదు అతడు వేసుకున్న జెర్సీపై all the best.. wish you good luck. Rohit Sharma అంటూ రాశాడు. ఈ విషయాన్ని యశ్ దయాళ్ తన ఇన్ స్టా గ్రామ్ లో చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ చేసిన తన జెర్సీని.. రోహిత్ శర్మతో కలిసి మైదానంలో దిగిన ఫోటోలను దయాళ్ ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. “దీని వెనక అద్భుతమైన అనుభవం ఉంది. మర్చిపోలేని జ్ఞాపకం ఉంది.. కృతజ్ఞతలు రోహిత్ భయ్యా అంటూ” యశ్ దయాళ్ ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కు రోహిత్ శర్మను ట్యాగ్ చేశాడు. దీంతో యష్ దయాళ్ ను రోహిత్ అభిమానులు అభినందిస్తున్నారు. ” రోహిత్ శర్మది మంచి మనసు. అతడు ఎలాంటి వారినైనా ప్రోత్సహిస్తాడు. టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తుంటాడు. తన వంతుకు మించి తోడ్పాటు ఇస్తుంటాడు. దానికి నిదర్శనమే ఇదీ. వచ్చే రోజుల్లో యశ్ దయాళ్ జాతీయ జట్టులో ఆడే అవకాశం లేకపోలేదని” రోహిత్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: ముంబై పై గెలిచిన తర్వాత.. విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే.. నవ్వు ఆపుకోలేరు..