Tilak Verma
MI vs RCB : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబైకి పేరు ఉంది. జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. కానీ గత మూడు సీజన్లుగా ఈ జట్టు ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. అలాగని ఆటగాళ్లు లేరా అంటే.. ఉన్నారు . కాకపోతే వాడుకోవడం తెలియడం లేదు. అందువల్లే ఆ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నది. ముంబై జట్టులో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అందులో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒకడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో అతడు అద్భుతాలు సృష్టించాడు. అవుట్ కాకుండా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాదిలో అతడు టి20 ఫార్మాట్ లో గడచిన నాలుగు ఇన్నింగ్స్ లలో 107*, 120*, 19*, 72* పరుగులు చేశాడు. దీనిని బట్టి అతడి సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అతడు అలా ఆడి న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్ మన్ రికార్డును బదులు కొట్టాడు. 2023 లో నాట్ అవుట్ గా ఉంటూ చాప్ మన్ 271 రన్స్ చేశాడు. అయితే అటువంటి తిలక్ వర్మను వాడుకోవడం ముంబై జట్టుకు చేత కావడం లేదు. అక్కడ దాకా ఎందుకు ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో.. రెండో మ్యాచ్ ను తిలక్ వర్మ గెలిపించిన తీరు సంచలనాన్ని సృష్టించింది. ఒకానొక దశలో 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టును తిలక్ వర్మ నిలబెట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ సామర్థ్యంతో ఆకట్టుకున్నాడు.. నాడు 55 బంతుల్లో 72 పరుగులు చేసి.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ద్వారా అభినందనలు అందుకున్నాడు.
Sky sad reaction for Tilak verma when he retired by the management❤❤❤❤❤
L(laund) decission by hardik kaliya#LSGvsMI #HardikPandya #LSGvMI#RohitSharma #SuryakumarYadav #tilakvarma pic.twitter.com/VutF5BkAwT
— S (@Always4kohli) April 5, 2025
ఇప్పుడేం జరుగుతోంది
టి20 లలో వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన తిలక్ వర్మ కు సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఓటమి అంచులో ఉన్నప్పుడు జట్టును ఒంటి చేత్తో గెలిపించిన సామర్థ్యం కూడా ఉంది. కానీ అటువంటి ఆటగాడిని ముంబై జట్టు సరిగా వాడుకోలేకపోతోంది. గడచిన మ్యాచ్లో నెమ్మదిగా పరుగులు చేస్తున్నాడని అతడిని రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించింది. అతని స్థానంలో శాంట్నర్ ను మైదానంలోకి రప్పించింది. అయినప్పటికీ ఓటమి తప్పించుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ చివరి ఓవర్ ను అద్భుతంగా వేయడంతో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ప్రస్తుతం బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. విల్ జాక్స్ అవుట్ కాగానే తిలక్ వర్మ మైదానంలోకి వచ్చాడు. 9 బంతులు ఎదుర్కున్న అతడు ప్రస్తుతానికి 14 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు ఉన్నాయి. వాస్తవానికి ముంబై జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ (17), రికెల్టన్ (17) అంతగా ఆకట్టుకోలేకపోయారు. వన్ డౌన్ బ్యాటర్ గా విల్ జాక్స్ ను పంపిస్తే.. అతడు 22 పరుగులు చేశాడు. మరో వైపు సూర్య కుమార్ యాదవ్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Stump Mic ️ Tilak Verma refused to bat and retired out when Hardik Pandya abusively shouted “Nikal Bhen Ke L©de” in the MI vs LSG last over.#tilakvarma #HardikPandya #StumpMic #MIvsLSG #LSGvsMI #IPL #RetiredOut pic.twitter.com/r3dZDoxEc9
— (@Crickaith) April 4, 2025
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Mi vs rcb tilak verma excels in match
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com