Rohith Sharma : ఐపీఎల్ లో ప్రస్తుతం 18వ ఎడిషన్ నడుస్తోంది. ఇప్పటివరకు 17 ఎడిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ 17 ఎడిషన్లలో ముంబై జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెరి ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. ముంబై జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో ఐదు సార్లు విజేతగా నిలిచింది.. తద్వారా ఐపీఎల్లో అత్యంత విలువైన జట్టుగా ఆవిర్భవించింది. అయితే గత సీజన్లో రోహిత్ శర్మ ను ముంబై జట్టు యాజమాన్యం కెప్టెన్ స్థానం నుంచి తొలగించింది. ఆస్థానంలో హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చింది. హార్థిక్ పాండ్యా నాయకత్వంలోనూ గత సీజన్లో ముంబై జట్టు అనుకున్నంత గొప్పగా రాణించలేకపోయింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే ఇప్పుడు కూడా ముంబై జట్టు ఒక మోస్తరు ఆట మాత్రమే ఆడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో ఉంది.. ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. ముంబై ఇండియన్స్ జట్టు తదుపరి మ్యాచ్ లలో విజయం సాధించాలి. అది జరగాలంటే ముంబై జట్టు బలంగా ఆడాలి.. దానికి తగ్గట్టుగానే ఆట తీరును మార్చుకోవాలి.. అయితే ప్రస్తుతం ఉన్న స్థితిలో ముంబైలో బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. చివరి దశలో ఆటగాళ్ల మధ్య సయోధ్య లేకపోవడంతో ఓటముల పాలవుతోంది. ఇక ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు ఆడి.. అద్భుతంగా పోరాడి విజయం సాధించింది.
Also Read : SRH 300 కొడితే.. బాబా వంగా కొత్త దేవుడే!
అరుదైన ఘనత
ఐపీఎల్ 2008లో మొదలైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా రోహిత్ శర్మ ఆడుతూనే ఉన్నాడు. మొదట్లో ఆటగాడిగా.. ఆ తర్వాత అద్భుతమైన బ్యాటర్ గా.. అనితర సాధ్యమైన విజయాలు అందించిన సారధిగా.. మళ్ళీ ఇప్పుడు కీలక ఆటగాడిగా రోహిత్ శర్మ ఐపీఎల్లో తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో 18 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీసీసీఐ రోహిత్ శర్మను ప్రత్యేకంగా సన్మానించింది. అతడికి వెండితో తయారుచేసిన ఒక జ్ఞాపికను అందించింది. ” ఆటగాడిగా.. సారధిగా.. కీలకమైన ప్లేయర్ గా రోహిత్ శర్మ బహుముఖ పాత్రలు పోషించాడు. దాదాపు 18 సంవత్సరాల నుంచి అతడు ఐపిఎల్ ఆడుతున్నాడు. అందువల్లే అతడి సేవలను గుర్తించి.. ఈ పురస్కారం అందించింది. అతడు క్రికెట్ కు మరిన్ని సేవలందించాలి. గొప్ప ఆటగాడిగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని” రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా, ఈ పురస్కారం అందుకున్న తర్వాత రోహిత్ శర్మ గర్వంగా ఫీలయ్యాడు..ఆ పురస్కారాన్ని చూసి మురిసిపోయాడు. తనకు ఈ పురస్కారం అందించిన బీసీసీఐ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసాడు. సుధీర్ణ కాలం ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో తనకు అండదండగా ఉన్న కుటుంబానికి.. అభిమానులకు, ప్రేక్షకులకు రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలియజేసాడు.