https://oktelugu.com/

IND vs SA : 9 పరుగులకే ఔటైనా రోహిత్.. అరుదైన ఘనత.. గాలిలో కొట్టుకుపోయిన కోహ్లీ రికార్డు

IND vs SA : ఏడు మ్యాచ్ లో బంగ్లాదేశ్ మినహా.. మిగతా అన్ని జట్లపై విఫలమైన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ ద్వారా టచ్ లోకి వచ్చాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2024 / 08:38 PM IST

    Rohit

    Follow us on

    IND vs SA : హిట్ మాన్ గా పేరుపొందిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రికార్డులు సాధించడం వెన్నతో పెట్టిన విద్య. 15 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్లో అతడు ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. ఎవరికీ అందని ఘనతలను అందుకున్నాడు. అలాంటి రోహిత్ టి20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు సరికొత్త చరిత్ర సృష్టించాడు. టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా తో తలపడుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో బంతిని తప్పుగా అంచనా వేసి ముందుకు వచ్చి ఆడబోయాడు.. అది బ్యాట్ ను తగిలి నేరుగా ఫీల్డ్ చేతిలోకి వెళ్లిపోయింది..ఇక సౌత్ ఆఫ్రికా కూడా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. పొట్టి ప్రపంచ కప్ ను మరోసారి దక్కించుకోవాలని రోహిత్ సేన కృత నిశ్చయంతో ఉంది. దీంతో బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ అభిమానులను మునివేళ్ళ మీద నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే అవుట్ అయినప్పటికీ సరికొత్త రికార్డును సృష్టించాడు.

    టి20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు టీమిండియా టాప్ ఆటగాడు విరాట్ కోహ్లీ 1,216 పరుగులు చేశాడు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో తొమ్మిది పరుగులు చేసి.. మొత్తంగా టి20 ప్రపంచ కప్ చరిత్రలో 1,220 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో కోహ్లీ ఆల్ టైం రికార్డ్ గాలిలో కొట్టుకుపోయింది. ఇక ప్రస్తుత ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఏడు మ్యాచ్లు ఆడి 257 పరుగులు చేశాడు. మూడవ టాప్ స్కోరర్ గా నిలిచాడు.. సూపర్ -8 మ్యాచ్లో ఆస్ట్రేలియా పై 92, ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి సూపర్ ఫామ్ లోకి వచ్చాడు రోహిత్ శర్మ. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో అదరగొడతాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మ కేశవ్ మహరాజ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు.

    రోహిత్ ఔట్ అయిన వెంటనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. 0 పరుగులు చేసి నిరాశపరచాడు కేశవ్ మహారాజ్ వేసిన బంతిని షాట్ ఆడబోయి.. వికెట్ కీపర్ కు చిక్కాడు. దీంతో ఒకే ఓవర్ లో రెండు బంతుల వ్యవధిలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 21*, సూర్య కుమార్ యాదవ్ 2* పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ చెప్పినట్టుగానే ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ టచ్లోకి వచ్చాడు. ఏడు మ్యాచ్ లో బంగ్లాదేశ్ మినహా.. మిగతా అన్ని జట్లపై విఫలమైన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ ద్వారా టచ్ లోకి వచ్చాడు.